ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల గొడవకు అలసలు కారణం?

By Bojja Kumar

హైదరాబాద్: ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల మధ్య 'ఆగడు' సినిమా విషయంలో చోటు చేసుకున్న గొడవ చిరిగి చాటంత అయి ప్రకాష్ రాజ్ ను సినిమా నుండి తప్పించిన సోనూ సూద్ ను తీసుకోవడంతో ఆగక పోగా...ప్రకాష్ రాజ్ పై దర్శకుల సంఘం ద్వారా చర్యలు తీసుకునే వరకు వెళ్లింది.

ఇటీవల ప్రకాష్ రాజ్ మీడియా ముందుకు వచ్చి ఈ గొడవలో తన తప్పు ఏమీ లేదని, తాను కో డైరెక్టర్ తో దొడవ పడిన మాట వాస్తమేకానీ, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఓ వ్యక్తి నాపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తు ఇదంతా చేయిస్తున్నాడంటూ పరోక్ష్యంగా శ్రీను వైట్లపై ఆరోపణలు చేసారు.

 Prakash Raj-Srinu Vaitla Rift behind?

తాజాగా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.....ప్రకాష్ రాజ్ ను 'ఆగడు' సినిమా నుండి తప్పించడానికి కారణం శ్రీను వైట్ల ఇగో హర్ట్ కావడమే అని అంటున్నారు.

ప్రకాష్ రాజ్ సెట్స్ కు లేటుగా రావడం సాధారణమే అని, అతని టాలెంట్ తమ సినిమాకు అవసరం కాబట్టి చాలా మంది దర్శకులు చూసి చూడనట్లు ఉండే వారని అంటున్నాయి. అయితే ఇటీవల ఉలవ చారు బిర్యానీ చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రకాష్ రాజ్ 'ఆగడు' సినిమా షూటింగ్ సమయంలో నటుడిగా కాకుండా....శ్రీను వైట్ల దర్శకత్వం బాగోలేదనే విధంగా ప్రవర్తించడంతో శ్రీను వైట్ల ఇగో హర్ట అయిందని అంటున్నారు.

సినిమాకు సంబంధించిన ఓ సన్ని వేశంలో శ్రీను వైట్ల కోరి హావబావాలు ప్రదర్శించడానికి ప్రకాష్ రాజ్ సహరించక పోగా....అసిస్టెంట్ డైరెక్టర్ తో గొడవ పడ్డాడని, దీంతో చిర్రెత్తిన శ్రీను వైట్ల ఇదే అదునుగా తన ప్రతాపం చూపెట్టారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X