విరాట్ కోహ్లీ ట్వీట్.. ప్రకాష్ రాజ్ దిమ్మతిరిగే సెటైర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి గా ఉన్న జై షా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ బాస్ గా వ్యవహరించనున్నారు. ఆయన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఐసీసీ బాస్ గా వ్యవహరించిన న్యూజిలాండ్ ఆటగాడు గ్రెగ్ బార్క్లే (62) తన పదవీకాలం ముగుస్తున్నందున మూడోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కొత్త బాస్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ ఆగస్టు 27 మంగళవారం నాడు అధికారిక ప్రకటన చేసింది. దీంతో పాటు మండలిలో అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్ కూడా కానున్నారు. కేవలం 35 ఏళ్ల వయసున్న జై షా డిసెంబర్ 1 నుంచి ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ తరుణంలో పలువురు క్రికెటర్లు ఐసీసీ నయా బాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌తో పాటు పలువురు ఎక్స్ లో తమ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా అభినందనలు తెలిపారు. 'ఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనందుకు జై షా కు అభినందనలు.. మీ ప్రయాణం విజయవంతమవ్వాలి'' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. 64.7 మిలియన్ల మంది ఫాలోవర్లతో కోహ్లీ పోస్ట్‌ను 3.3 మిలియన్ల మంది చూశారు. కోహ్లీ ఫ్యాన్స్ కూడా అభినందలు తెలిపారు.

ఇక్కడ వరకు అంతా ఒకే .. క్రికెటర్ విరాట్ కోహ్లీ అభినందన పోస్ట్‌పై విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ స్పందించారు. తనదైన స్టైల్ లో దిమ్మతిరిగే సెటైర్ వేశారు. విరాట్ కోహ్లి పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "భారతదేశ గ్రేటెస్ట్ లెజెండ్.. బ్యాట్స్‌మెన్..బౌలర్.. వికెట్ కీపర్.. ఫీల్డర్.. ఆల్టిమేట్ ఆల్‌రౌండ్ క్రికెటర్.. అంతేకాదు. .ఐసీసీ అధ్యక్షుడిగా పోటీ లేకుండా ఎన్నికైనందుకు స్టాండింగ్ ఒవేషన్ ఇద్దాం'' అంటూ పంచ్ వేశాడు.

ఐసీసీ అధ్యక్ష పదవికి క్రికెట్యేతర వ్యక్తిని ఎంపిక చేయడంపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరికొందరూ ప్రకాష్ రాజ్ పై విమర్శలు గుప్పిస్తూ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లకు మీకు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలంటూ చమత్కరించారు. అలాగే గతంలో ఐసీసీ అధ్యక్షుడి ఎంపికను ప్రకాష్ రాజ్ కు నెటిజన్లు గుర్తు చేశారు.
ఇండియా అలయన్స్ అధినేత శరద్ పవార్ గతంలో ఐసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. శరద్ పవార్ 10,000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచారా? రాజీవ్ శుక్లా 500 వికెట్లు తీసిన తొలి బౌలరా? ప్రణవ్ ముఖర్జీ టీమిండియా మొదటి కెప్టెన్ నే కాదా అంటూ.. ప్రకాశ్ రాజ్ పై పంచులు వేస్తున్నారు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. 'బెంగళూరు లోక్‌సభ ఎన్నికల్లో మీరు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. క్రికెటర్ల ట్వీట్లకు రిప్లై ఇచ్చే బదులు ఫ్లాప్ చిత్రాల్లో నటించకూడదా? నువ్వు అధికారిక ఇడియట్‌గా మారుతున్నావా' అంటూ ప్రకాష్ రాజ్ కు పంచ్ చేశాడు.


Click it and Unblock the Notifications











