మళ్లీ పెళ్లి కొడుకుగా ప్రకాశ్ రాజ్.. పార్ట్‌నర్‌తో లిప్‌లాక్‌ ఫోటో వైరల్!

దక్షిణాదిలో స్టార్ యాక్టర్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కెరీర్‌పరంగా దూసుకెళ్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్, అలాగే యష్‌తో కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్: చాప్టర్ 2 చిత్రం, ధనుష్ నటిస్తున్న తిరుచిత్రంబళం లాంటి చిత్రాల షూటింగులో బిజీగా ఉన్నారు. అయితే ఇంతటి బిజీలో కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఇలా బిజీ బిజీ షెడ్యూల్స్ మధ్య ప్రకాశ్ రాజ్ మరోసారి పెళ్లి కొడుకు అయ్యాడు. అలా పెళ్లికొడుకుగా మారడానికి కారణం ఏమిటంటే...

ప్రకాశ్ రాజ్ తొలి వివాహం

ప్రకాశ్ రాజ్ తొలి వివాహం

ప్రకాశ్ రాజ్ తొలి వివాహం లలితా కుమారితో 1994లో జరిగింది. దాదాపు 15 ఏళ్ల దాంపత్య జీవితం వారిద్దరి మధ్య కొనసాగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో 2009లో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోని ప్రముఖ కోరియోగ్రాఫర్ పోని వర్మను ఇష్టపడ్డారు. దాంతో ప్రకాశ్ రాజ్ జీవిత భాగస్వామిగా పోని వర్మ ప్రవేశించారు.

మళ్లీ పెళ్లి చేసుకోవాలని

మళ్లీ పెళ్లి చేసుకోవాలని

ప్రకాశ్ రాజ్, పోని వర్మ ఇద్దరు ఇష్టపడటంతో వారి దాంపత్య జీవితం 2010లో ప్రారంభమైంది. వివాహం తర్వాత వారిద్దరూ అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారిద్దరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నారు. వేదాంత్ అంటే వారికి పంచప్రాణాలు అనే విషయం పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో వ్యక్తమైంది. అయితే తల్లిదండ్రుల పెళ్లిని చూడలేదనే కారణంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని మారాం చేయడంతో ప్రకాశ్ రాజ్, పోని వర్మ మరోసారి నవ వధువులుగా మారారు.

 పోనివర్మను ప్రేమించి రెండో వివాహం

పోనివర్మను ప్రేమించి రెండో వివాహం

తమ 11 ఏళ్ల దాంపత్య జీవితం పూర్తయిన సందర్భంగా పెళ్లి రోజును ఘనంగా జరుపుకొన్నారు. కొడుకు వేదాంత్ కోసం నవ వధువులుగా మారిన ప్రకాశ్ రాజ్, పోని వర్మ మధ్య అద్బుతమైన కెమిస్ట్రీ కనిపించింది. ఆ ఇద్దరూ కొత్త అనుభూతితో కూడిన ప్రేమలో తడిసి ముద్దైనట్టు కనిపించారు. భార్యపై అత్యంత ప్రేమను కురిపిస్తూ లిప్‌లాక్ కూడా చేసేశారు. తన తల్లిదండ్రులను పెళ్లి దుస్తుల్లో చూసి కొడుకు వేదాంత్ ఆనందంతో గెంతులేసి ఉంటాడనే ఫీలింగ్ చూసే వారికి కలిగింది.

ఈ రాత్రి మళ్లీ పెళ్లి చేసుకొన్నాం అంటూ ప్రకాశ్ రాజ్

ఈ రాత్రి మళ్లీ పెళ్లి చేసుకొన్నాం అంటూ ప్రకాశ్ రాజ్

పోని వర్మతో మరోసారి పెళ్లి విషయం గురించి ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ రోజు రాత్రి మళ్లీ మేము పెళ్లి చేసుకొన్నాను. నా కొడుకు వేదాంత్ కోరిక మేరకు పెళ్లి చేసుకొన్నాం. ఇదో అద్భుతమైన ఫీలింగ్. మళ్లీ కుటుంబంలో మంచి అనుభూతికి చోటు కలిగింది అంటూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో తెలిపారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

 పోని వర్మ భార్యనే కాదు.. లవర్, ఫ్రెండ్ అంటూ

పోని వర్మ భార్యనే కాదు.. లవర్, ఫ్రెండ్ అంటూ

ప్రకాశ్ రాజ్ తన భార్య పోని వర్మ గురించి ట్విట్టర్‌లో ప్రశంసలు గుప్పించారు. ఈ రాత్రి కొత్తవారికి సరైనదిగానే కనిపిస్తుంది. ఈ రాత్రిని మధురానుభూతిగా మార్చిన నా భార్యకు థ్యాంక్స్. ఆమె నాకు భార్యనే కాదు.. అద్బుతమైన స్నేహితురాలు, ఓ లవర్, జీవిత ప్రయాణంలో మంచి తోడండే ప్రయాణికురాలు అంటూ పోని వర్మ గురించి గొప్పగా ప్రకాశ్ రాజ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X