ప్రకాష్ రాజ్ కొత్త బండి కొన్నాడు....(ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రకాష్ కొత్త బండి కొన్నాడు. దాన్ని చూసి తెగ మురిసి పోతున్నాడు. షూటింగ్ ఎప్పుడు అయిపోతుందా? దాన్ని ఎప్పుడు నడుపుదామా? అని ఆసక్తిగా ఉన్నాడు. ఇంతకీ ప్రకాష్ రాజ్ కొన్న కొత్త వెహికిల్ ఏమిటో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న ట్రాక్టరే ప్రకాష్ రాజ్ కొత్త బండి.

Prakash Raj tweet about his new Tractor

ఈ ఫోటోను పోస్టు చేసి...‘ఇదే నా కొత్త బండి...వెరీ క్యూట్...ఎప్పుడు షూటింగ్ అయిపోతుందా? ఎప్పుడు దాన్ని నడుపుదామనే ఆసక్తిగా ఉంది. నా కల నిజం కాబోతోంది' అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు. సినిమాల్లో అత్యంత ఖరీదైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్. కోట్లలో సంపాదన. ఎప్పుడూ షూటింగులంటూ బిజీగా ఉండే ప్రకాష్ రాజ్....ఏ మాత్రం ఖాళీ దొరికినా తన ఫాం హౌస్ లో గడపడం, అక్కడ వ్యవసాయం చేయడం, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకోవడం అలవాటు.

ఆ మధ్య ఎన్టీఆర్‌తో కూడా ప్రకాష్ రాజ్ ఫాం హౌస్ లో పార్టీ చేసుకున్నాడు. స్వయంగా ఎన్టీఆర్‌తో పిజ్జాలు కూడా చేయించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X