ఘనంగా జరిగిన ప్రకాష్ రాజ్ రెండో వివాహం
నటుడు, దర్శకుడు ప్రకాష్ రాజు..ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మని ముంబైలో వివాహం చేసుకున్నారు. విలే పార్లే ప్రాంతంలోని సహారా స్టార్ హోటల్లో మంగళవారం ఉదయం వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. పంజాబీ సంప్రదాయంలో జరిగిన వీరి వివాహానికి పోనీ వర్మ సోదరుడు రాఖీ, క్రికెటర్ శ్రీశాంత్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ప్రకాష్ రాజు క్లోజ్ అశోసియేట్స్, దర్సకులు రాధామోహన్, విజి, ఏక్టర్ కుమరవెల్, కొరియోగ్రాఫర్ కెవి గుహన్, తాన్యా సమంతిలు హాజరయ్యారు. ఇక పోనీ వర్మ తాజాగా ప్రకాష్ రాజ్ సొంత బ్యానర్ లో రూపొందిన తమిళ చిత్రం పాటలకు కొరియోగ్రఫి అందించింది. అలాగే ఆమె తెలుగులో పూరీ జగన్నాధ్ సినిమాలకూ, హిందీలో ప్రియదర్శన్ సినిమాలకూ ఎక్కవగా ఆమె కొరియోగ్రఫి చేసింది. త్వరలో వీరిద్దరూ కలిసి చెన్నై, హైదరాబాద్ ల్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రకాష్ రాజ్ వాంటెడ్ పోనీ వర్మ ముంబై కొరియోగ్రాఫర్ prakash raj wanted pony varma puri jagannath mumbai


Click it and Unblock the Notifications