ప్రకాష్ రాజ్ భార్య కూడా అదే దారిలో...
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రెండో భార్య పోనీ వర్మ తర్వలో ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ కొరియోగ్రాఫర్‌గా వెలుగొందుతున్న పోనీ వర్మ తన కొలీగ్స్ ఫరాఖాన్, జోయా అక్తర్, రీమా కాగ్టి, కిరణ్ రావు మాదిరి దర్శకురాలిగా టర్న్ అవ్వబోతోంది.
పోనీ వర్మకు బాలీవుడ్‌తో 11 ఏళ్ల అనుబంధం ఉంది. 2001లో వచ్చిన 'యే తేరా ఘర్ యే మేరా ఘర్' అనే హిందీ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన పోనీ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల విద్యాబాలన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'డర్టీ పిక్చర్' ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రకాష్ రాజ్ పోనీ వర్మను ప్రేమించి 2010లో పెళ్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భర్త ప్రకాష్ రాజ్ కూడా దర్శకత్వంలో రాణిస్తుండటం, తాజాగా పోనీ కూడా అదే బాటలో నడవటం సీనీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











