Tirumala Laddu row: ‘మీ హద్దుల్లో మీరు ఉండండి’: ప్రకాశ్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..
Tirumala Laddu row: పవిత్రమైన తిరుమల లడ్డూ మహా ప్రసాదం (Tirupati laddu)తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. ఈ వివాదంపై భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వెల్లువెత్తున్నాయి. ఈ తరుణంలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయగా.. మా అధ్యక్షుడు, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ వివాదం చర్చనీయంగా మారింది. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీ తిరుపతి తిరుమల వారి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఈ వివాదానికి రాజకీయం అంటుకుంది. ఈ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుంది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది.

పవన్ కళ్యాణ్ ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. "తిరుపతి బాలాజీ ప్రసాద్‌లో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు మరియు గొడ్డు మాంసం కొవ్వు)కలిపినట్లు తేలింది. ఈ విషయంతో మనమందరం తీవ్రంగా కలత చెందాము. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ, ఇది దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలపై వెలుగులోకి వస్తున్నాయి.' అని పేర్కొన్నారు.
అలాగే.. 'యావత్తు భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా మొదలైన వారు ఈ విషయంపై చర్చించాలి. 'సనాతన ధర్మాన్ని' ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి మనందరం కలిసి రావాలని భావిస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
పవన్ పై ప్రకాశ్ రాజ్ ఫైర్..
తిరుపతి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్.. ' ప్రియమైన పవన్ కళ్యాణ్. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై దయచేసి విచారణ జరపండి. ఈ వివాదానికి కారణమైన దోషులను కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. కానీ, ఆ విషయాన్ని పక్కన పెట్టి.. ఈ సమస్యను దేశ వ్యాప్తం చేస్తూ.. ఎందుకు ఆందోళనలు వ్యాపించేలా ప్రకటనలు చేస్తున్నారు.
ఇప్పటికే మన దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.
ప్రకాష్ రాజ్ మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్..
ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరలవుతోంది. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు విభిన్నప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఫ్యాన్సే కాదు ఇతర ప్రముఖులు కూడా ప్రకాష్ రాజ్ ట్విట్ పై మండిపడుతున్నాయి.ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్ పోస్ట్‌కు టాలీవుడ్ నటుడు మంచు విష్ణు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చారు. ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ గారు హద్దుల్లో మీరు ఉండండి అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు నటుడు మంచు విష్ణు . మీరు కూడా ఓ లూక్కేయండి.
' శ్రీ ప్రకాశ్‌రాజ్ గారు.. మీరు దయచేసి కాస్త తగ్గండి.తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సమగ్ర విచారణ చేయాలని కోరారు. పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సరిగ్గానే పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే.. మతపరమైన రంగు ఎక్కడ పులుముకుంటుందో?. #మీ పరిధుల్లో మీరు ఉండండి' అంటూ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చారు మంచు విష్ణు.దీంతో ఈ విషయం మరింత రసవత్తరంగా మారింది. గతంలో మా అసోసియేషన్ ఎన్నికల నేపథంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఎన్నికల పోరు జరిగిన విషయం తెలిసిందే. దాని ఎఫ్టెక్ అనుకుంటున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











