ప్రకాష్ రాజ్ పై త్వరలో నిషేధం?

By Staff

ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలి అనేది ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ ఎజెండా లా కనపడుతోంది. అయినా అతనితో వేగటం కష్టం. షెడ్యూలు టైముకెప్పుడూ లేటే !అయినా నే మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాను.. ఇప్పుడు అనుకుని ఏం లాభం.కాని..అతనికి ఆల్టర్ నేట్ లేడండి.కరెక్టే గాని ఇలా లేటయితే తరువాత నేనుండను కదా .ఓ నిర్మాత ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన.అతని కాంబినేషన్ సీన్లే బ్యాలన్స్ ఉన్నాయి సార్.అయినా దిల్ రాజు గారి లాంటి బ్యానర్స్ కే దిక్కులేదు.ఎంత గొప్ప నటుడో అంతలా నరకం చూపిస్తున్నాడు.కోరి పెట్టుకున్నఓ దర్శకుడు ఆక్రోశం.పవన్ కళ్యాణ్ 'జల్సా' కి కూడా ఈ దుస్థితి తప్పలేదుట. అయినా తెలుగులో ఉన్న టాలెంటుని ఎంకరేజ్ చెయ్యరు మీకిలా జరగాల్సిందే.ఓ నటుడు శాపనార్ధం. ఇలా ఎవరు రేంజిలో వాళ్ళు తిట్ల దండకం ఎత్తుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కంత్రి, పరగులలో మెయిన్ రోల్స్ చేస్తున్నాడు. అందుకే అవి బాగా లేటవుతున్నాయిట. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.అప్పుడు ఆయనపై నిషేధం పెట్టారు. కాని తప్పని స్ధితిలో సడలించారు. ఇంత జరిగినా ఆయన కొంచెం కూడా మారలేదు సరికదా తమిళంలో వరసగా సినిమాలు నిర్మంచటంపై పూర్తి స్థాయి దృష్టి పెడుతున్నాడు. టైము సెన్సు లేకపోవటం, డేట్స్ ప్రకారం సరిగా సెట్స్ కి హాజరు కాకపోవటం తోనే మహేష్ బాబు 'అతిధి', పూరీ 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' నుండి తొలిగించారు.పెద్ద దర్శకులు, సంస్థలు, దర్శకులు అతని జోలికి పోకుండా ఉండటమే సేఫ్ అని భావిస్తున్నారట. అంటే అనధికారికంగా నిషేధం అమలు జరుగుతున్నట్లే కదా.అయినా ప్రకాష్ రాజ్ రెండు పడవల ప్రయాణం కష్టమే కదా.

More from Filmibeat

Read more about: prakash raj tollywood tamil telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X