హీరోతో అఫైర్.. హీరోయిన్‌పై హీరో భార్య దాడి.. వైరల్ గా మారిన వీడియో!
సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య అఫైర్ల గురించి ఏవో ఒక పుకార్లు పుట్టుకు వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని నిజాలు ఉంటే మరికొన్ని కేవలం పుకార్లు మాత్రమే ఉంటాయి. ఇక తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నటి ప్రకృతి మిశ్రాతో కలిసి కారులో గడుపుతున్న నటుడు బాబుషాన్ మొహంతి భార్య వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పాటు నటిని ఆమె చితక్కొట్టిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

పోలీస్‌స్టేషన్ వరకూ
సినిమాల్లో చూపించేది నిజ జీవితంలో కూడా జరగవచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒడియా నటీనటులకు సంబంధించిన వీడియో చూసిన తర్వాత ఎవరైనా అది నిజమే అనుకుంటారు. అసలు ఏమైంది అంటే ఒడియా నటుడు బాబుషన్ మొహంతికి సంబంధించిన ఒక వీడియో వార్తల్లోకి ఎక్కింది. వీడియోలో, శనివారం ఉదయం భువనేశ్వర్ వీధుల్లో నటుడు బాబుషన్ మొహంతి భార్య తృప్తి సత్పతి మరియు తన సహనటి ప్రకృతి మిశ్రా మధ్య గొడవ జరిగింది. దీంతో విషయం పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లింది.

కారులో వెళ్లడం చూసి
ఒడియా నటుడు బాబూషన్ మొహంతి భార్య త్రిప్తి సత్పతి తన భర్తకు అక్రమ సంబంధం ఉందని అనుమానించి మీడియాకు ఎక్కింది. మీడియా కథనాల ప్రకారం, భార్యాభర్తల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం బాబుషాన్ భార్య తృప్తి తన భర్త, నటి ప్రకృతి మిశ్రాను కలిసి కారులో వెళ్లడం చూసి షాక్ తిన్నారు. కారు ఆపడమే కాక ప్రకృతిపై దాడి చేయడం ప్రారంభించారు.
రెడ్ హ్యాండెడ్‌గా
నటి ప్రకృతి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, నటుడి భార్య ఆమె జుట్టును లాగడం ప్రారంభించింది. మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ మొత్తం వ్యవహారంతో రచ్చ జరగడంతో భువనేశ్వర్‌లోని ఖరావెల్ నగర్ పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లింది . ఈ విషయంలో ప్రకృతి మిశ్రా తల్లి కృష్ణ ప్రియా మిశ్రా అధికారికంగా ఫిర్యాదు చేశారు. వైరల్‌గా మారిన వీడియోలో, బాబుషాన్ భార్య తృప్తి తన భర్త మరియు నటి ప్రకృతిని కారులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాత వారిపై దాడి చేయడాన్ని చూడవచ్చు.
విమానాశ్రయం వద్ద
త్రిప్తి మరొక వీడియోలో ప్రకృతి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు త్రిప్తి ప్రకృతి జుట్టును లాగడానికి ప్రయత్నించడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భువనేశ్వర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP) ప్రతీక్ సింగ్ మాట్లాడుతూ, ప్రకృతి తల్లి ఫిర్యాదు మేరకు, బాబుషన్ భార్య త్రిప్తి సత్పతి, కొంత మంది గూండాలు కలిసి చెన్నైకి వెళ్లేందుకు విమానాన్ని క్యాచ్ చేయడానికి భువనేశ్వర్ విమానాశ్రయం వద్దకు వెళుతున్న క్రమంలో వారిద్దరినీ ఆపారని చెబుతున్నారు.

కొన్నాళ్లుగా గొడవ పడుతు
వారిద్దరూ తమ సినిమా ప్రమోషన్ కోసం వెళ్తున్నారని అన్నారు. ఇక సినిమాల విషయానికి బాబుషాన్ నటించిన 'దమన్' సెప్టెంబర్ 30న ఒడియా వెండితెరపై విడుదల కానుంది. మరో వైపు, ఇక ఆయన భార్య త్రిప్తి చివరిసారిగా ఒరియా చిత్రం 'ప్రేమమ్'లో బాబుషన్‌తో కలిసి కనిపించింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరూ ఇప్పుడు కొన్నాళ్లుగా గొడవ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











