ప్రణీత్ హనుమంతుపై కొరడా ఝులిపించిన కోర్టు.. ఎన్ని రోజుల రిమాండ్ విధించిందంటే?

రోస్టింగ్ వీడియోల సృష్టిస్తూ సాధారణ ప్రజలను మొదలుకొని.. సెలబ్రిటీల వరకు వ్యంగ్యంగా, అపహాస్యం చేస్తూ పైశాచిక ఆనందం పొందే యూట్యబర్ ప్రణీత్ హనుమంతుకు కోర్టు కొరడా ఝులిపించింది. కొద్ది రోజుల క్రితం తండ్రి, కూతుళ్ల అసభ్యంగా, సభ్య సమాజం సిగ్గుపడేలా బరితెగించిన ఆయన బూతులు మాట్లాడటం సామాజిక మాధ్యమ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది.

అయితే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, మనోజ్ మంచు లాంటి సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు వ్యవహారంలోకి వెళితే..

Praneeth Hanumanthu Sent 14 days Judicial custody by Nampally Court in Posco Act Case

సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన నిరసనలు, అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు అందిన ఫిర్యాదులతో ప్రణీత్ హన్మంతును తెలంగాణ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన తర్వాత ప్రాథమికంగా ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అతడిని జ్యూడిషియల్ కస్టడీలో విచారిస్తారు.

ప్రణీత్‌పై ఐటీ యాక్ట్ 67బీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్) కింద, పోస్కో చట్టం కింద, ఐటీ యాక్టర్ సెక్షన్ 79 కింద, ఐపీసీ 294 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ హన్మంతు అరెస్ట్ తర్వాత సాయిధరమ్ తేజ్‌తోపాటు సినీ ప్రముఖులు, సాధారణ ప్రజలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.

More from Filmibeat

Read more about: nampally court posco act
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X