హీరోకు ఆమె లక్...నిర్మాతకు భారం

By Srikanya

హైదరాబాద్ : ప్రణీత కెరీర్ డౌన్ అని అనుకున్న సమయంలో 'అత్తారింటికి దారేది' ఆమెకో దారి చూపించింది. ఆ చిత్రంలో నటించడంతో ఆమె మరో చిత్రంలో ఏకంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. మరో ప్రక్క కన్నడంలో కూడా ఆమె నటించిన బ్రహ్మ చిత్రం మంచి హిట్టైంది. దాంతో ఆమె ఇప్పుడు వేరే పెద్ద హీరోల చిత్రాల్లో కూడా ఆఫర్స్ వరసలో వస్తున్నాయి.

స్టార్ డైరక్టర్స్ లక్కీ హ్యాండ్ గా ఆమె ను తీసుకుందామని ముచ్చటపడుతున్నారు...సెంటిమెంట్ ని నమ్మి ముందుకు వెళ్లే హీరోలు రికమెండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడామె తన రెమ్యునేషన్ ని ఏకంగా ఒక కోటికి పెంచేసి అందరికీ ట్విస్ట్ ఇస్తోందని సమాచారం. హీరోగారు చెప్పారు కాబట్టి ఆమెను తీసుకోక తప్పదు...అలాగని అంత రెమ్యునేషన్ ఇచ్చి తీసుకోవటం బిజినెస్ పాయింటాఫ్ వ్యూ లో బడ్జెట్ కి మించిన భారం అని నిర్మాతలు గోలెత్తిపోతున్నట్లు సమచారం.

Praneetha hikes remuneration

'అత్తారింటికి దారేది'లో పవన్‌ కల్యాణ్‌ పెద్ద మరదలుగా కనిపించిన ప్రణీతకు టైమ్ స్టార్టైంది. ఆ సినిమా వరకు అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ భామకి ఇప్పుడు పెద్ద సినిమా అవకాశాలే వస్తున్నాయి. గెలుపు గుర్రాలను నమ్మి ముందుకు వెళ్తున్న ఎన్టీఆర్ తాజా చిత్రం లో ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చారు.ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ రభస సినిమాలో అవకాశం కొట్టేసిందీ అమ్మడు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంత ఓ హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత.

ఇక ఈ ఆనందంతో ఆమె ఎక్కడికెళ్లినా గతంలో లేని పలకరింపులు వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపట్టేసి పలకరిస్తున్నారని, సహజంగా ఏ పార్టీలకు తాను వెళ్లనని, అందాన్ని మరికాస్త పెంచుకోడానికి ప్రయత్నిస్తాను తప్ప బయటికి వెళ్లనని తెలిపింది. కానీ ఈమధ్య ఎక్కడికెళ్లినా మీరు ఫలానా సినిమాలో నటించారు కదా అని ప్రతివాళ్లూ పలకరిస్తుంటే సంతోషంగా ఉందని, ప్రేక్షకులు తనను గుర్తుపడుతున్నారన్న ఆనందం ముందు మరేమీ తనకు సంతోషాన్ని కలిగించలేకపోతున్నాయని, మొదట్లో ఇటువంటి అనుభవాలు ఎదురైనా ఇప్పుడుమాత్రం చాలా సరికొత్తగా అనిపిస్తోందని చెబుతోంది.

ఏవైనా మరోసారి ఆమె స్టార్ తిరిగినట్లేనని టాలీవుడ్‌లో కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్‌తోచేసే చిత్రం కనుక హిట్ అయిందీ అంటే ప్రణీత మరోసారి తన కెరీర్‌ను టాప్ పొజిషన్‌లోకి తీసుకువెళుతుంది అనడంలో సందేహం లేదు. ఇంకో విషయం...ప్రణీతకు బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందట. అదీ..రామ్‌చరణ్ చేసే రెండో సినిమాలో అంటున్నారు. అదే నిజమైతే.. బాలీవుడ్‌లో కూడా ప్రణీత తన ప్రతాపాన్ని చూపెడుతుందేమో చూడాలి. నిజంగా లక్ అంటే ప్రణీతదే అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X