పవన్ పవర్...మనోజ్‌‍తో లిప్ లాక్ (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: బోలెడు గ్లామర్, యాక్టింగ్ టాలెంటు ఉన్నా.....ఇప్పటి వరకు సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది హీరోయిన్ ప్రణీత. పవర్ స్టార్ హీరోగా తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన తర్వాతే ప్రణీతలో చాలా విషయం ఉందనే విషయాన్ని అందరూ గ్రహించారు. ఆమె అందాల బాపు బొమ్మలా ఉదంటూ అందలం ఎక్కించేసారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తర్వాతే ప్రణీత స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకొందని చెప్పొచ్చు.

ఇదే అదునుగా గ్లామర్ డోసు పెంచేసి మరింత దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది ప్రణీత. అందాల ఆరబోతతో పాటు లిప్ లాక్ సీన్లకు కూడా మొహమాటం లేకుండా ఒప్పేసుకుంటోంది. ప్రస్తుతం 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో మనోజ్‌కు జోడీగా నటిస్తున్న ప్రణీత ఇందులో లిప్ లాక్ సన్నివేశంలో నటించడం చర్చనీయాంశం అయింది. అందుకు సంబంధించిన ఫోటో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోంది.

 Praneetha locking lips with Manchu Manoj

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. జనవరి 31న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపు పది సంవత్సరాల అనంతరం మోహన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కావడంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈచిత్రం పోస్టుప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోంది. బ్రహ్మానందం, ఎంఎస్.నారాయణ, అలీ, రఘుబాబు, గుర్లిన్ చోప్రా, అలేఖ్యవర్మ, తెలంగాణ శకుంతల, గిరిబాబు, పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనథ్, కృష్ణ భగవాన్, సుప్రీత్, భరణి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X