Adipurush Release date: రాముడిగా ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత అతని సినిమాల కోసం కేవలం తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఆది పురుష్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తూ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా సినిమా అద్భుతం ఉంటుంది అని ఎంతో నమ్మకంతో ఉన్నారు.
పైగా టాలెంటెడ్ దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడంతో మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం లో ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి సినిమా తప్పకుండా వస్తుంది అని చిత్ర యూనిట్ గతంలోనే తెలియజేసింది. ఎన్ని సినిమాలు పోటీకి వచ్చినా కూడా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Recommended Video


అయితే ఏ డేట్ ఫిక్స్ చేసుకున్నారు అనే విషయంలో కూడా ప్రస్తుతం ఒక టాక్ అయితే వైరల్ గా మారుతొంది. జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. గురువారం రోజు కావడంతో వారం చివర వరకు సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. టాక్ కొంచెం బాగున్నా కూడా కలెక్షన్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాపై ఆసక్తిగా చూపించే అవకాశం ఉంటుంది.
ఇక ఈ డేట్ విషయంలో అయితే చిత్ర యూనిట్ ఫైనల్ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను విడుదల చేయలేదు. అప్పట్లో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ వస్తోంది అని అనుకున్నారు. కానీ దర్శకుడు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక త్వరలోనే అద్భుతమైన టీజర్ తో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











