చిరంజీవి సర్జా మృతి.. చేతులు వణికిపోయాయి అంటూ హీరోయిన్ ప్రణీత ఎమోషనల్

కన్నడ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో మృతి చెందారు. నేటి మధ్యాహ్నం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలియడంతో కన్నడ ఇండస్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మేఘనా సర్జాను ఒంటరిగా విడిచివెళ్లి పోయాడు. చిరంజీవి మృతిపై కన్నడ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

బెండు అప్పారావ్ హీరోయిన్..

బెండు అప్పారావ్ హీరోయిన్..

చిరంజీవి సర్జా సతీమణి మేఘనా బెండు అప్పారావ్ సినిమాతో తెలుగులోని ఎంట్రీ ఇచ్చింది. ఆపై కన్నడ, మళయాలంలో సినిమాలు చేసింది. చిరంజీవి సర్జాతో దాదాపు పదేళ్ల ప్రేమ ప్రయాణాన్ని 2018లో వివాహా బంధంగా మలుచుకున్నారు. ఇలా అకస్మాత్తుగా తనను వదిలేసి వెళ్లడంతో మేఘనా కన్నీరుమున్నీరు అవుతోంది.

స్పందించిన ప్రణీత..

స్పందించిన ప్రణీత..

చిరంజీవి సర్జాతో కలిసి రెండు మూడు సినిమాల్లో నటించిన ప్రణీత ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ‘మరణ వార్త తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాను.. అసలు రాయలేకపోతున్నాను.. నా చేతులు వణుకుతున్నాయి..అతనో అద్భుత సహనటుడు, మంచి మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'నని ట్వీట్ చేసింది.

అల్లు శిరీష్ ఎమోషనల్ ట్వీట్..

అల్లు శిరీష్ ఎమోషనల్ ట్వీట్..

చిరంజీవి సర్జా మరణ వార్త తెలుసుకున్న శిరీష్.. సోషల్ మీడియాలో స్పందించాడు. ‘ఆయన మరణ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను. అతనికి కేవలం 39 ఏళ్లే. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానభూతి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాల'ని కోరుకున్నాడు.

Recommended Video

Hello Guru Prema Kosame Movie Success Meet
నమ్మలేకపోతున్నాను...

నమ్మలేకపోతున్నాను...

చిరంజీవి సర్జా మరణంపై కుష్భూ స్పందిస్తూ.. ‘నమ్మలేకపోతున్నాను.. భయంకరమైన ఘటన.. యంగ్ హీరో, అర్జున్ మేనళ్లుడు కన్నడ నటుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం షాక్. అతనెంతో ప్రతిభావంతుడు..ఎన్నో మంచి చిత్రాలను చేశాడు. ఆయన భార్య పరిస్థితి తలుచుకుంటూ బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాల'ని కోరుకుంది. చిరంజీవి సర్జా అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X