twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అత్తారింటికి' ఎఫెక్ట్ : ప్రణీతకు భారీ ఆఫర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇంతకాలం వరకూ గుర్తింపు లేని సినిమాల్లో నటించిన ప్రణీత ఆమధ్య కార్తితో కూడా 'శకుని' అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభావాన్ని ఏ మాత్రం చూపకపోవడంతో ఇక ప్రణీత కెరీర్ డౌన్ అని అనుకున్న సమయంలో 'అత్తారింటికి దారేది' ఆమెకో దారి చూపించింది. ఆ చిత్రంలో నటించడంతో ఆమె మరో చిత్రంలో ఏకంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. దాంతో ఆమె ఇప్పుడు మేఘాలతో తేలుతోంది.

    'అత్తారింటికి దారేది'లో పవన్‌ కల్యాణ్‌ పెద్ద మరదలుగా కనిపించిన ప్రణీతకు టైమ్ స్టార్టైంది. ఆ సినిమా వరకు అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ భామకి ఇప్పుడు పెద్ద సినిమా అవకాశాలే వస్తున్నాయి. గెలుపు గుర్రాలను నమ్మి ముందుకు వెళ్తున్న ఎన్టీఆర్ తాజా చిత్రం లో ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చారు.ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ రభస సినిమాలో అవకాశం కొట్టేసిందీ అమ్మడు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంత ఓ హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత.

    ఇక ఈ ఆనందంతో ఆమె ఎక్కడికెళ్లినా గతంలో లేని పలకరింపులు వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపట్టేసి పలకరిస్తున్నారని, సహజంగా ఏ పార్టీలకు తాను వెళ్లనని, అందాన్ని మరికాస్త పెంచుకోడానికి ప్రయత్నిస్తాను తప్ప బయటికి వెళ్లనని తెలిపింది. కానీ ఈమధ్య ఎక్కడికెళ్లినా మీరు ఫలానా సినిమాలో నటించారు కదా అని ప్రతివాళ్లూ పలకరిస్తుంటే సంతోషంగా ఉందని, ప్రేక్షకులు తనను గుర్తుపడుతున్నారన్న ఆనందం ముందు మరేమీ తనకు సంతోషాన్ని కలిగించలేకపోతున్నాయని, మొదట్లో ఇటువంటి అనుభవాలు ఎదురైనా ఇప్పుడుమాత్రం చాలా సరికొత్తగా అనిపిస్తోందని చెబుతోంది.

    ఏవైనా మరోసారి ఆమె స్టార్ తిరిగినట్లేనని టాలీవుడ్‌లో కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్‌తోచేసే చిత్రం కనుక హిట్ అయిందీ అంటే ప్రణీత మరోసారి తన కెరీర్‌ను టాప్ పొజిషన్‌లోకి తీసుకువెళుతుంది అనడంలో సందేహం లేదు. ఇంకో విషయం...ప్రణీతకు బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందట. అదీ..రామ్‌చరణ్ చేసే రెండో సినిమాలో అంటున్నారు. అదే నిజమైతే.. బాలీవుడ్‌లో కూడా ప్రణీత తన ప్రతాపాన్ని చూపెడుతుందేమో చూడాలి. నిజంగా లక్ అంటే ప్రణీతదే అంటున్నారు.

    English summary
    Pranitha has now been cast opposite NTR Jr. She has signed Rabhasa (working title), NTR's current film being directed by Kandireega Santosh Srinivas. Interestingly, the movie has Samantha has main female lead. Both Samantha and Pranitha were the heroines in Atharintiki Daaredi. This is a big boost to Pranitha's career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X