నెటిజన్ కోరిక మేరకు ప్రైవేట్ ఫోటో.. బాత్ టబ్‌లో హీరోయిన్ ప్రణీత రచ్చ

తెలుగు ప్రేక్షకులకు ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద కళ్లతోటి.. అంటూ ప్రణీత కోసమే పాట రాసినట్టుగా ఉంటుంది. హలో గురు ప్రేమ కోసమే సినిమాతో కుర్రకారును ప్రణీత తన కళ్లతోనే కట్టిపడేసింది. బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది అంటూ పవన్ కళ్యాణ్ కూడా ప్రణీత కోసం పాట పాడేశాడు. అలా ప్రణీతను పొగడేందుకు తెలుగు రచయితలు ముందుంటారు. ఇన్నాళ్లు ప్రణీతలో అందం మాత్రమే ఉందని అనుకున్న వాళ్లకు ఆమెలో మానవత్వం తెలిసి వచ్చింది. కరోనా, లాక్డౌన్‌లో ప్రణీత చేసిన సేవా కార్యక్రమాలకు అందరూ ఫిదా అయ్యారు.

ముందుగా అడుగు వేసింది..

ముందుగా అడుగు వేసింది..

కరోనా వైరస్ విజృంభించడం, లాక్డౌన్ విధించడంతో ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయింది.. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఎంతో మంది బాధపడ్డారు. అలాంటి వారిని ఆదుకునేందుకు హీరోలందరూ విరాళాలు ఇస్తూ వచ్చారు. కానీ హీరోయిన్లలో మాత్రం ప్రణీత ముందడుగే వేసింది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా స్వయంగా రంగంలోకి దిగింది.

ఆహార పంపిణీ..

ఆహార పంపిణీ..


ఆకలితో అలమటించిన వారికి ప్రణీత ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. స్వయంగా వండి మరీ అందరి ఆకలిని తీర్చింది. ఇలా ఒక్క రోజు చేసి చేతులు దులుపుకోలేదు. వీలైనన్న రోజులు నిత్యం ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యేంత వరకు ప్రణీత సేవా కార్యక్రమాలను చేస్తూ వచ్చింది.

ప్రణీత ఇమేజ్ మారింది..

ప్రణీత ఇమేజ్ మారింది..

కరోనా, లాక్డౌన్ కంటే ముందు ప్రణీతను గ్లామర్ డాల్, నటిగానే చూసిన జనాల దృష్టిలో పూర్తిగా ఇమేజ్ మారిపోయింది. సేవా గుణం, మానవత్వం ఉన్న మనిషిగా ప్రణీతను అందరూ గౌరవిస్తూ వచ్చారు. అలా సోషల్ మీడియాలో రియల్ ‘హీరో'యిన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

బిగ్ బాస్ షోతో మెస్మరైజ్..

బిగ్ బాస్ షోతో మెస్మరైజ్..


బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద ప్రణీత అందాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి ముద్దు ముద్దుగా మాట్టాడిన మాటలు, ఆ కళ్లను చూసి అభిమానులు పడిపోయారు. అలా బిగ్ బాస్ షో ద్వారా ప్రణీత మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

తాజాగా అలా..

తాజాగా అలా..


తాజాగా ప్రణీత ఓ ట్రెండ్‌కు తెరదీసింది. ఎలాంటి ఫోటో అయినా అడగండి పంపిస్తానంటూ అభిమానులకు ఆఫర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో షేర్ చేద్దామని అనుకుని, షేర్ చేయకుండా ఉన్న ఫోటోను పెట్టండి అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో బాత్ టబ్‌లో స్నానం చేస్తోన్న ఫోటోను ప్రణీత షేర్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X