ఐమాక్స్ లో సినిమా ప్రేక్షకులకు చేదు వార్త
హైదరాబాద్ లో 2డి, 3డి సినిమాలకు ప్రసిద్ధిగాంచిన ఐమాక్స్ థియేటర్లో సినిమా చూడాలనుకునేవారికో చేదు వార్త. ఈ థియేటర్లో సినిమా టిక్కెట్ ధరలను మరింత పెంచాలని కోరుతూ సంస్థ చేసిన విజ్జప్తిని కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ లెసైన్సింగ్ అథారిటీ అంగీకరించిం ది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీనిప్రకారం గంట సమయం ప్రదర్శించే 2డి సినిమా టిక్కెట్ ధర రూ150 నుంచి రూ200లకు, గంట కన్నా అధిక సమయం ప్రదర్శించే 2డి, 3డి సినిమా టిక్కెట్ ధరలను రూ 200 నుంచి రూ250కి పెంచారు. ఈ ధరలు నేటి నుంచి(మంగళవారం) అమల్లోకి రానున్నాయి.
More from Filmibeat
టాలీవుడ్ ఐమాక్స్ త్రీడీ సినిమా టిక్కెట్ రేట్లు రమేష్ ప్రసాద్ ramesh prasad 3d cinema imax ticket rates


Click it and Unblock the Notifications











