twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా గొడవ, ప్రసాద్ ల్యాబ్స్ ధ్వంసం

    By Bojja Kumar
    |

    ఓ సినిమాపై నెలకొన్ని వివాదం కారణంగా ప్రసాద్ ల్యాబ్స్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో ల్యాబోరేటరీ పాక్షికంగా ధ్వంసం అయింది. చెన్నయ్ లోని సాలిగ్రామం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఎండిఎంకె పార్టీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వంద సంవత్సరాల క్రితం ధ్వసం చేయడబడ్డ డామ్(ఆనకట్ట) ఆధారంగా రూపొందిన 'డామ్999" అనే ఇంగ్లీష్ సినిమా ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఎండిఎంకె తమిళనాడు జనరల్ సెక్రటరీ మల్లయ్ సత్యతో పాటు, 23 మంది కార్యక్తలను అరెస్టు చేశారు.

    తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు మధ్య వివాదానికి కారణమైన 'ముళ్లపెరియార్" డ్యామ్ వివాదాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే 'డామ్ 999" దర్శకుడు సోహన్ రాయ్ వాదన మాత్రం మరోలా ఉంది. వంద సంవత్సాల క్రితం ధ్వసమైన చైనాలోని బ్యాంకియో డామ్ ఆధారంగా ఈ సిసిమా రూపొందించామని, అప్పట్లో ఆ డామ్ కొలాప్స్ అవడం వల్ల చైనాలో 2.5 లక్షల మంది మరణించారని తెలిపారు.

    English summary
    group of MDMK cadres barged into Prasad Film Laboratories in Saligramam and damaged property ahead of a preview of an English film, Dam999, a disaster flick on a 100-year-old dam's collapse.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X