‘డెక్కన్ చార్జర్స్’పై కన్నేసిన తెలుగు సినీ నిర్మాత
హైదరాబాద్ : కష్టాల్లో ఉన్న ఐపీఎల్ టీం డెక్కన్ చార్జర్స్‌ను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ జట్టును కొనుక్కునేందుకు చాలా మంది బడా బాబులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అందిన ఆసక్తిర విషయం ఏమిటంటే ఈ జట్టును దక్కించుకునేందుకు తెలుగు సినీ నిర్మాత, పివిపి సినిమాస్ సంస్థ అధినేత ప్రసాద్ వి పొట్లూరి కూడా బిడ్ వేసారని తెలుస్తోంది.
విజయవాడకు చెందిన ప్రసాద్ వర పొట్లూరి బిజినెస్ మ్యాన్‌గా ఎదిగి ఆ తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. తన పేరుపైనే 'పివిపి సినిమాస్' అనే బేనర్ స్థాపించారు. పివిపి సినిమా బేనర్‌పై ఇప్పటి వరకు తమిళం, తెలుగులో పలు భారీ సినిమాలు నిర్మించారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రాన్ని తమిళంలో 'నాన్ఈ' పేరుతో పివిపి సినిమా వారు ప్రొడ్యూస్ చేసారు.
రవితేజ, గోపీ చంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'బలుపు' . ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు. ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
సౌతిండియాలో లీడింగ్ ఫిల్మ్ ఫైన్సాయర్‌గా ప్రసాద్ వి పొట్లూరి కొనసాగుతున్నారు. తమిళంలో అనేక చిత్రాలకు ఆయన ఫైనాన్స్ చేసారు. మరి ఈ బడా నిర్మాత చేతికి డెక్కన్ చార్జర్స్ జట్టు దక్కుతుందో? లేదో? మరికొన్ని రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











