For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ పెంపుడు తండ్రి ఐమాక్స్ వెంకట్ అరెస్ట్

    By Bojja Kumar
    |
    ‘బాహుబలి’ తండ్రి ఐమాక్స్ వెంకట్ అరెస్ట్..

    మహిళను మోసం చేసిన కేసులో ఐమాక్స్ థియేటర్ మేనేజర్, సినీ నటుడు వెంకట ప్రసాద్ అలియాస్ ఐమాక్స్ వెంకట్ అరెస్టయ్యారు. బంజారా హిల్స్‌లో నివాసం ఉండే 33 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్న వెంకట్.... ఇపుడు పెళ్లి చేసుకోవడానికి నో చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    వెంకట్ బాహుబలి సినిమాలో ప్రభాస్(శివుడి పాత్ర) పెంపుడు తండ్రి పాత్రలో, ఇటీవల విడుదలైన 'పిఎస్‌వి గరుడవేగ' సినిమాలో సీఎం పీఏ పాత్రలో నటించారు.

     ఏడేళ్లుగా సహజీవనం

    ఏడేళ్లుగా సహజీవనం

    సదరు మహిళకు పది సంవత్సరాల క్రితం వివాహం అయింది. అయితే భర్తతో మనస్పర్ధలు రావడంతో విడిగా ఉంటోంది. ఇద్దరూ విడాకుల కోసం కోర్టుకెక్కారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే వెంకట్‌ ఆ మహిళతో పరిచయం ఏర్పరచుకున్నారు. ప్రేమ, పెళ్లి అని నమ్మించి ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

     రెండు సార్లు అబార్షన్

    రెండు సార్లు అబార్షన్

    భర్త నుండి విడాకులు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు మహిళను లోబరుచుకున్న వెంకట్ ఆమెను రెండు సార్లు గర్భవతిని చేశాడని, అయితే పెళ్లయ్యే వరకు పిల్లలు వద్దని గర్భం తీయించినట్లు సదరు మహిళ ఆరోపించింది.

    చంపేస్తానని బెదిరింపు

    చంపేస్తానని బెదిరింపు

    అయితే వెంకట్ మరో మహిళతో తిరుగుతుండటంతో సహజీవనం చేస్తున్న మహిళ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అందుకు వెంకట్ మొహం చాటయడంతో పాటు చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

     కేసు నమోదు చేసిన పోలీసులు

    కేసు నమోదు చేసిన పోలీసులు

    పోలీసులు నిందితుడిపై 420, 354డి, 506, 509 కింద కేసు నమోదు చేశారు. ప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

    English summary
    Prasad's IMax manager Venkata Prasad was arrested in cheating case. The case was registered under Section 420, 354D, 506 and 509 against the accused.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X