హీరో రాజశేఖర్ అలాంటోడు కాదంటూ... దర్శకుడి వివరణ!
టాలీవుడ్ సినీయర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం 'కల్కి' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'అ!' ఫేం, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాజశేఖర్, ప్రశాంత్ వర్మ మధ్య విబేధాలు వచ్చినట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడిని రాజశేఖర్ చాలా ఇబ్బంది పెడుతున్నాడని, అతడికి కావాల్సినవి సమకూర్చడం లేదని, సీన్స్ షూట్ చేసే సమయంలో ప్రశాంత్ వర్మ చెప్పినట్లు రాజశేఖర్ వినడం లేదనే చర్చ ఫిల్మ్ నగర్లో సాగుతోంది.

సీనియార్టీ అహం చూపిస్తున్నాడంటూ...
తాను సీనియర్ హీరో కావడం రాజశేఖర్ తన అహం చూపిస్తున్నాడని, దర్శకుడికి నచ్చిన విధంగా కాకుండా తనకు నచ్చిన విధంగానే అన్నీ జరుగాలనే మూడ్లో ముందుకు సాగుతున్నట్లు వార్తలు వెలవడ్డాయి.

సన్నిహితులకు చెప్పుకుని బాధ పడ్డాడా?
సెట్స్‌లో రాజశేఖర్ ప్రవర్తనతో విసుగు చెందుతున్న ప్రశాంత్ వర్మ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాడని, తన బాధ అంతా ఇండస్ట్రీలోని స్నేహితులకు చెప్పుకుని బాధపడ్డట్లు వార్తలు రావడంతో... ప్రశాంత్ వర్మ స్పందించాడు.

రాజశేఖర్ అలాంటోడు కాదంటూ దర్శకుడి వివరణ
‘‘రాజశేఖర్ గారి మీద వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆయన లాంటి స్వీటెస్ట్ పర్సన్‌తో ఇంత వరకు నేను పని చేయలేదు. కెమురా ముందు నేను ఎం చెబితే అది చేస్తున్నారు. ‘ఎస్ సర్' అంటూ నవ్వుతూ నాకు కావాల్సినవి అందిస్తున్నారు''.... అని ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు.

కల్కి
సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సీ కల్యాణ్ ‘కల్కి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తున్నది. సినిమాలో కీలకంగా మారడంతో ఈ సెట్‌ను 2 కోట్లతో ఈ సెట్ రూపొందించారని, 1980 దశకంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌ను ప్రతిబింబించేలా వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











