ఎట్టకేలకు మూడో ప్రాజెక్ట్ సెట్... త్వరలోనే ఫస్ట్ లుక్ అంటోన్న విలక్షణ దర్శకుడు
అ!, కల్కి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ రెండూ కూడా కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాలేదు. అ! సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చాలా ఏళ్ల తరువాత ఓ తెలుగు సినిమా జాతీయ అవార్డు లభించడం అది కూడా మేకప్ క్యాటగిరీలో రావడం చాలా అరుదు. ఈ చిత్రం అంతటి గుర్తింపును తీసుకొచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంది. అయితే రెండో అవకాశంగా కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కథ, కథనం అంతా బాగానే ఉన్నా.. కల్కి యావరేజ్‌గా మిగిలింది. క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్ వల్లే అలా జరిగిందని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. అలా కల్కి కూడా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అన్న ట్యాగ్‌ను తీసుకురాలేకపోయింది. అయితే మూడో సినిమా కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రశాంత్. మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ అడిగిన నెటిజన్స్‌కు తన స్క్రిప్ట్ పూర్తయిందని, దానికి సంబంధించిన ఫైల్స్ అని ఓ కట్ట కట్టిన బుక్స్‌ను షేర్ చేశాడు.

అయితే అది అ! చిత్రానికి సీక్వెల్ అని, మళ్లీ నిర్మాత నాని దగ్గరకు వెళ్తే రిజెక్ట్ చేశాడని అప్పట్లో టాక్ వచ్చింది. ఆ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఖండించాడనుకోండి అది వేరే విషయం. తాజాగా తన మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చేశాడు. ఈయన తన గత రెండు చిత్రాల్లోని ఫస్ట్ లుక్‌లోనే సినిమా కాన్సెప్ట్ ఏంటని ఓ హింట్ ఇచ్చాడు. అయితే మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన హింట్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ఎంతో ఆత్రుతగా ఉన్నానని ట్వీట్ చేశాడు. అయితే మరి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











