ప్రభాస్ చెల్లెలికి చేదు అనుభవం.. వరస్ట్ యాప్ డిలీట్ చేస్తున్నానంటూ పోస్ట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పుడు తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. తెలుగు నుంచి మొట్ట మొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి బాహుబలితో సత్తా చాటడమే కాక ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకువెళ్ళాడు. ఇలా ప్రభాస్ తన పెదనాన్న నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉంటే పెదనాన్న కుమార్తె తన సోదరి అయిన ప్రశీదను మాత్రం సినీ నిర్మాణంలోకి దింపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురయింది. ఈ విషయం మీద ఆమె సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

తనదైన శైలిలో
ప్రభాస్ ఒకప్పుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా, అతి తక్కువ కాలంలోనే ఆయన స్టార్ హీరో హోదా అందుకున్నాడు. రాజమౌళి పుణ్యమా అని బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కీర్తి సంపాదించిన ప్రభాస్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

నిర్మాతగా
అయితే పెదనాన్న నట వారసత్వాన్ని కొనసాగిస్తూ పెదనాన్న కుమార్తె విదేశాల్లో చదువుకునే వచ్చిన ప్రశీదను పెదనాన్నకు చెందిన గోపికృష్ణ మూవీస్ సంస్థ ద్వారా నిర్మాతగా లాంచ్ చేశాడు ప్రభాస్. ఆయన హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధేశ్యాం సినిమా ద్వారా ప్రశీద నిర్మాతగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ప్రశీదకు ఓ చేదు అనుభవం
అంతకు ముందు కూడా ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన తల్లిదండ్రులు కృష్ణంరాజు, శ్యామలకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ప్రభాస్ చెల్లి ప్రశీదకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రశీద సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి సదరు సంస్థను తూర్పార పట్టింది.

స్విగ్గీ డెలివరీ వల్ల
నేటి బిజీ లైఫ్ లో అందరూ కూడా ఎక్కువగా ఫుడ్ డెలివరీ యాప్స్ మీద ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు ఇప్పుడు విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందాయి. ప్రశీద తాజాగా స్విగ్గీ సేవలను విమర్శిస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్విగ్గీ డెలివరీ వల్ల తనకు చేదు అనుభవం ఎదురైందని ప్రశీద పోస్ట్‌లో పేర్కొంది.

డిలీట్ చేస్తున్నా
స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టిన ఫుడ్ కాకుండా మరో ఫుడ్ డెలివరీ అయ్యిందని.. దీనిపై ఫిర్యాదు చేస్తే వాళ్లు మాకు ఏమీ సంబంధం లేదేనేట్టుగా చేతులెత్తేశారని ప్రశీద పోస్ట్‌లో వివరించింది. అంతే కాదు, స్విగ్గీ వాళ్లు ఫుడ్ ఆర్డర్ చేసిన చాలా సేపటికి గానీ డెలివరీ చేయడం లేదని తెలిపింది. వారు అందించే ఫుడ్ కూడా క్వాలిటీ లేదని అడిగితే బ్యాడ్ స్ట్రీక్ అంటూ కస్టమర్ల మీదనే నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె ఆరోపించింది. అంతే కాక ఈ యాప్ ఇప్పుడే డిలీట్ చేస్తున్నానని ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











