తాగి కధలు రాస్తా.. ఆసక్తికర విషయం బయట పెట్టిన ప్రశాంత్ నీల్.. కండీషన్స్ అప్ల్లై!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 1 చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు ఆయన ఎవరో కూడా తెలియని వారు కూడా ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఆయన దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా సీక్వెల్ కేజిఎఫ్ చాప్టర్ 2 విడుదలకు సిద్ధమైంది ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఉగ్రం సినిమాతో

ఉగ్రం సినిమాతో

ఉగ్రం సినిమాతో కన్నడ సినీ పరిశ్రమకు 2014వ సంవత్సరంలో అడుగు పెట్టాడు ప్రశాంత్ నీల్. అయితే కేజిఎఫ్ సినిమా మాత్రం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది.. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా 2018 సంవత్సరంలో విడుదలై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది.. ఈ సినిమా విజయవంతం కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నామని అప్పట్లోనే సినిమా యూనిట్ ప్రకటించింది.

 కామెంట్స్ వైరల్

కామెంట్స్ వైరల్


ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైంది కానీ కరోనా లాంటి అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి.హీరో హీరోయిన్లతో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న కొన్ని కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి.

 మాటివ్వాలని

మాటివ్వాలని


అలా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకు మద్యం తాగే అలవాటు ఉందని బయట పెట్టాడు ప్రశాంత్ నీల్. అయితే ఒక కండిషన్ తో ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ బయటపెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే.. ఇంటర్వ్యూలో తను మాట్లాడే విషయాన్ని మీరు వినండి కానీ జనం దాకా వెళ్లకుండా కట్ చేసి పక్కన పడేస్తామని తనకు మాటివ్వాలని కోరాడు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు జనాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మందు తాగుతూనే

మందు తాగుతూనే


అదేమిటంటే తాను మద్యం సేవిస్తానని.. మందు తాగుతూనే కథలు రాస్తుంటానని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. అలా మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో సన్నివేశాల గురించి ఆలోచన చేస్తుంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సినిమాకు కథ ముఖ్యం కాదని.. దాన్ని ఎలా ప్రెజెంట్ చేశామని అనేదే ముఖ్యమని చెప్పుకొచ్చారు.

భారీగా బిజినెస్‌

భారీగా బిజినెస్‌


ఇక హోంబలే ఫిలింస్ బ్యానర్ పై భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రేక్ష‌కుల నిరీక్ష‌ణ‌కు ఫ‌లితంగా 'కేజీఎఫ్ చాప్ట‌ర్‌-2' ఏప్రిల్ 14న ప్రేక్ష‌కులు ముందుకు రానుండగా ప్ర‌తి ఏరియాలో ఈ సినిమా భారీగా బిజినెస్‌ను జ‌రుపుకుంది. సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X