బెదిరింపుల‌కు లొంగను.. వేధింపులకు భయపడను.. ఐ డోంట్ కేర్.. ఓటర్ నిర్మాత సవాల్

Recommended Video

Court Says No Abjection For Voter Movie Release || Filmibeat Telugu

మంచు విష్ణు, సురభి జంటగా జి. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓటర్‌'. జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మించారు. ఈ చిత్ర ప్రపంచ థియేట్రికల్ హక్కుల‌ను సార్ధక్‌ మూవీస్‌ పతాకంపై ప్రశాంత్‌ గౌడ్‌ దక్కించుకున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో చిత్ర రామరీల్స్‌కి చెందిన నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట, దర్శకుడు కార్తీక్‌పై 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ‌ కోర్టులో కేసు వేసిన విషయం విదితమే. సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ వేణుకుమార్ వెల్ల‌డించారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశాంత్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ఓటర్‌ మూవీని అడ్డుకొనేందుకు

ఓటర్‌ మూవీని అడ్డుకొనేందుకు

ఓటర్‌ సినిమా విడుదల విషయంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఎన్ని బెదిరింపులు వచ్చినా సినిమాని ఆపేది లేదు. శుక్రవారం జూన్ 21న గ్రాండ్‌గా విడుదల‌ చేస్తున్నాం. ‘నేను గత 12 ఏళ్లుగా చిత్ర రంగంలో ఉన్నాను. డిస్టిబ్యూటర్‌గా, నిర్మాతగా, ఫైనాన్సర్‌గా ఉన్నాను. దాదాపు 42 సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేశా. ఏడు సినిమాలు నిర్మించాను. జాతీయ స్థాయిలో ప్రొడ్యూస్ చేశాను. ఇప్పటి వరకు నాపై ఎలాంటి వివాదాలు లేవు అని అన్నారు.

 370 థియేటర్లలో రిలీజ్

370 థియేటర్లలో రిలీజ్

కానీ నా కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఓటర్ సినిమా ఆగిపోతుందని మార్కెట్‌లో చాలా రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని పాయింట్‌ నచ్చి కొనుకున్నా. ఓటర్ విలువ‌ని తెలిపే చిత్రమిది. రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన ఓ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే మనం ఎలా చర్య‌లు తీసుకోవచ్చో ఇందులో ద‌ర్శ‌కుడు చర్చించారు. ఎల‌క్షన్స్‌ తర్వాత రావాల్సింది. ఈ హక్కులు తీసుకున్నాక. సినిమాపై పలు వివాదాలున్నాయని చెప్పారు. లీగల్‌గా సల‌హాలు తీసుకున్న‌ప్పుడు విడుదల‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఈ నెల‌ 21న దాదాపు 370 థియేటర్లలో విడుదల‌ చేస్తున్నాం అని తెలిపారు.

 నేను బెదిరింపులకు లొంగను

నేను బెదిరింపులకు లొంగను

అయితే ఓటర్ సినిమాని తీసుకున్న‌ప్పట్నుంచి మార్కెట్‌ నుంచి వివిధ రకాల‌ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. వేధింపుల‌కు గురి చేస్తున్నారు. సినిమాని ఎలా రిలీజ్‌ చేస్తారంటూ బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపు కాల్స్‌ వచ్చినా అధైర్య పడకుండా సినిమాని రిలీజ్‌ చేయాల‌ని నిర్ణ‌యించాం. నేను నా కష్టార్జితంతో కొనుక్కున్న చిత్ర‌మిది. లీగల్‌గా తీసుకున్నా. లీగల్‌గా ముందుకెళ్తున్నా అని ప్రశాంత్ గౌడ్ స్పష్టం చేశారు.

వివాదాలతో సంబంధం లేదని

వివాదాలతో సంబంధం లేదని


ఓటర్ సినిమాకి సంబంధించి క్రియేటివ్‌ సైడ్‌ వివాదాలుంటే అది నాకుగానీ, నిర్మాతకి గానీ సంబంధం లేదు. ఈ నెల‌లో నేను విడుదల‌ చేయబోతున్నా ఐదో చిత్ర‌మిది. ఏ సినిమాకి థియేటర్ల విషయంలో సమస్య రాలేదు. కానీ ఈ సినిమా విషయంలోనే ఎగ్జిబిటర్స్‌ ఒత్తిడికి గురయ్యారు. నేను ఇండస్ట్రీలో చాలా రోజుగా ఉన్నాను. నాకూ కొంత మంది ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ ఉన్నారు. ఆ పరిచయాలతో సినిమాని విడుదల చేస్తున్నా. విడుదల‌ను ఆపేది లేదు' అని ప్రశాంత్ గౌడ్ ఘాటుగా స్పందించారు.

 పిటిషన్‌ కోర్టు తిరస్కరణ

పిటిషన్‌ కోర్టు తిరస్కరణ

అడ్వకేట్ వేణుకుమార్ మాట్లాడుతూ, ‘24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ వేసిన పిటిషన్ ని కోర్టు ఫాల్స్‌ సూట్‌గా భావించి తిరస్కరించింది. అలాగే సినిమా విడుదల విషయంలో ఎలాంటి అభ్యంతరం తెల‌పలేదు. మా వాదనని ప్రశంసించింది. కావున ప్రస్తుతం ‘ఓటర్‌' సినిమా విడుద‌ల చేసుకోవ‌చ్చు అని తెలిపింది. దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్‌ కూడా వచ్చింది' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X