సలార్ అంటే అర్థమిదే.. ప్రభాస్ అమాయకుడు.. ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ కామెంట్స్
ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సినిమా అనౌన్స్ చేశాడు. చడీచప్పుడు లేకుండా ఏకంగా టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేశాడు. ఎంతో క్రూరుడిగా చూపించబోతోన్నట్టు చెప్పనకనే చెప్పేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్ల కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. మరో వైపు తారక్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. విమర్శల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే ఇండియా మొత్తం ఒక్కసారిగా తిరిగి చూసింది.

హోంబళే ప్రకటన..
కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబళే చేసిన ట్వీట్ ఒక్కసారిగా ప్రభంజనాన్ని సృష్టించింది. వారు చేసిన ట్వీట్‌తో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో మూవీ ఫిక్స్ అయిందని అందరికీ అర్థమైంది. ఇక టైటిల్ పోస్టర్, అప్డేట్ల గురించి ముందే సమాచారం ఇచ్చేశారు.

‘సలార్'గా ప్రభాస్
కేజీయఫ్‌ను మించిన క్రూరత్వం, విలనిజం, హీరోయిజాన్ని ‘సలార్'లో చూపించబోతోన్నట్టు కనిపిస్తోంది. అత్యంత క్రూరుడిగా ప్రభాస్‌ను చూపించబోతోన్నట్టు తెలుస్తోంది. టైటిల్ పోస్టర్‌లో ప్రభాస్ చూపులు, గన్ను పట్టుకున్న విధానం అన్నీ కూడా వైరల్ అయ్యాయి.

నెటిజన్ల ట్రోలింగ్..
కన్నడ దర్శకుడైన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా తీయడాన్ని జీర్ణించుకోలేకపోతోన్నారు. కన్నడలో ఏ హీరో దొరకలేదా? ప్రభాస్‌తో ఎందుకు తీస్తున్నావ్ అంటూ అభిమానులు ప్రశాంత్ నీల్‌ను ప్రశ్నిస్తున్నారు. మరో వైపు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. మైత్రీ మూవీస్‌తో ఎన్టీఆర్ కాంబోలో ప్రశాంత్ నీల్ సినిమా వస్తుందని రూమర్లు వినిపించాయి. తీరా ఇలాంటి ప్రకటన రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

స్పందించిన దర్శకుడు..
నెటిజన్లు చేస్తోన్న ట్రోలింగ్‌కు ప్రశాంత్ నీల్ స్పందించాడు. ప్రభాస్‌లో ఎంతో అమాయకత్వం ఉంది.. అందరిలో హీరోల్లోకెల్లా చాలా అమాయకుడు.. అతనిలో ఉన్న అమాయకత్వాన్ని బయటకు తెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకే ప్రభాస్‌తో సినిమా తీస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
Recommended Video

సలార్ అంటే..
ఇక సలార్ అనే టైటిల్ బయటకు రాగానే.. దాని అర్థం ఏంటంటూ అందరూ వెతకడం ప్రారంభించారు. కొందరు ఉర్దూ, పర్షియన్ భాషలకు వెళ్లారు. అయితే సలార్ అంటే ఏంటో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు. సలార్ అంటే రాజుకు కుడి భుజం లాంటి వాడు... జనరల్.. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మరి ఈ సినిమాలో ప్రభాస్ కంటే మీద ఒకరుంటారా? అతనెవరు? అని మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











