twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF క్రియేటర్ ప్రశాంత్ నీల్ తెలుగోడే.. ఆ ఏపీ మాజీ మంత్రికి స్వయానా సోదరుడే?

    |

    చేసింది అతి తక్కువ సినిమాలే అయినా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ముందుగా కన్నడ సినిమా పరిశ్రమలో ఉగ్రం అనే సినిమా చేసిన తర్వాత కేజిఎఫ్ సినిమా చేసి ప్రపంచవ్యాప్తంగా కన్నడ సినీ పరిశ్రమ సత్తా ఏమిటో తెలియజెప్పాడు. అయితే తాజాగా ఆయన గురించి ఆయన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారు అని ఆయన సోదరుడు ఒక ప్రముఖ మాజీ మంత్రి అని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే

    పర్సనల్ లైఫ్

    పర్సనల్ లైఫ్

    కేజిఎఫ్ సినిమా విడుదలయ్యే వరకు కూడా ప్రశాంత్ నీల్ అనే ఒక దర్శకుడు ఉన్నాడు అని కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే కేజిఎఫ్ సినిమా సూపర్ హిట్ అయిందో, అప్పుడు ఆయన గురించి మిగతా భాషల ప్రేక్షకులకు కూడా తెలిసిందే. అయితే ఆయన ఒక దర్శకుడు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు ఎవరికీ తెలియదు.

    రఘువీరా రెడ్డి

    రఘువీరా రెడ్డి

    అయితే ఆయన బ్యాక్ గ్రౌండ్ మామూలు బ్యాక్ గ్రౌండ్ ఏమీ కాదని తెలుస్తోంది. ఆయన స్వయంగా ఒక మాజీ మంత్రి సోదరుడు అనే విషయం తాజాగా వెల్లడైంది. ప్రశాంత్ నీల్ స్వగ్రామం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉన్న మడకశిర మండలంలోని నీలకంఠాపురం. ఈ పేరు వినగానే మీకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఒకప్పటి కీలక నేత రఘువీరా రెడ్డి అనే పేరు గుర్తుకు రాకమానదు.

    నీలకంఠాపురం నీల్

    నీలకంఠాపురం నీల్

    అవును ప్రశాంత్ నీల్ స్వయంగా రఘువీరా రెడ్డి సోదరుడు. వారి ఇంటి పేరు నీలకంఠాపురం అంటే ఆ ఊరి పేరే తమ ఇంటి పేరుగా ఆ కుటుంబం పేరు మార్చుకున్నారు. అయితే ప్రశాంత్ మాత్రం ఆ నీలకంఠాపురం అనే మొత్తాన్ని పెట్టుకోకుండా నీల్ అనే పదం వరకు పేరులో పెట్టుకున్నారట.

    చాలా నిరాడంబరంగా

    చాలా నిరాడంబరంగా

    రఘువీరా రెడ్డి తండ్రి, ప్రశాంత్ నీల్ తండ్రి ఇద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా బెంగళూరులో సెటిల్ అయ్యారని, ఆయన రఘువీరారెడ్డి బాబాయి అవుతారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కూడా అప్పుడప్పుడు గ్రామానికి వచ్చేవాడు కానీ చాలా నిరాడంబరంగా ఉండేవాడని, ఆయన ఒక పెద్ద దర్శకుడు అన్న విషయం కూడా అక్కడ చాలా మందికి తెలియదని అంటున్నారు.

    చాలా నిరాడంబరంగా

    చాలా నిరాడంబరంగా

    ఇక ఇదే విషయాన్ని కేజిఎఫ్ 2 సినిమాలో ఇనాయత్ ఖలీల్ పాత్ర పోషించిన బాలకృష్ణ కూడా వెల్లడించారు. ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి అయిన ఆయన ప్రశాంత్ నీల్, రఘువీరారెడ్డి ఇద్దరూ నాకు సమీప బంధువులు అనే విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పుడు చాలా మంది ప్రశాంత్ నీల్ కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చినా సరే తెలుగువాడని తెలుగు వాడు ఎక్కడున్నా సత్తా చాటుతాడు అని అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

    English summary
    Prashanth neel is a close relative of ap congress ex-minister raghuveera reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X