డైలామాలో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ.. షాకిచ్చిన కన్నడ అభిమానులు..

ప్రశాంత్ నీల్.. పేరు తెలియని సినీ ప్రేమికుడు ఉండరు. అత్యంత నరకప్రాయమైన కోలార్ గనుల సృష్టికర్త, ఎదురే లేని మొనగాడు రాకీ భాయ్ లాంటి పాత్రల సృష్టికర్త. వందల చిత్రాలను అనుభవం అయితే లేదు గానీ మాస్ ప్రేక్షకులను ఎలాకట్టిపడేయాలన్న కిటుకు మాత్రం తెలుసు. తన మాయాజాలంతో దేశం మొత్తాన్ని మంత్ర ముగ్దుల్ని చేసేశాడే. కేజీఎఫ్ సినిమా దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కేవలం రెండు చిత్రాల అనుభవం ఉన్న ప్రశాంత్ నీల్.. జాతీయ స్థాయి దర్శకుడిగా మారిపోయాడు.

నేషనల్ వైడ్ క్రేజ్..

నేషనల్ వైడ్ క్రేజ్..

రాజమౌళి, శంకర్ వంటి దర్శకులు ఎన్నో యేళ్లుగా కష్టపడితే వచ్చిన క్రేజ్.. ప్రశాంత్ నీల్ రెండో చిత్రంతోనే సంపాదించుకున్నాడు. ప్రశాంత్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. అయితే ప్రశాంత్ మాత్రం ప్రస్తుతం తన దృష్టి అంతా చాఫ్టర్ 2పైనే ఉందని చెప్పుకొచ్చాడు.

భారీ స్థాయిలో చాఫ్టర్ 2..

భారీ స్థాయిలో చాఫ్టర్ 2..

కేజీఎఫ్ క్రియేట్ చేసిన రికార్డులను, బెంచ్ మార్క్‌లను ఢీ కొట్టేలా చాఫ్టర్ 2 రెడీ అవుతోంది. అంతా సవ్యంగా ఉండుంటే.. ఈ పాటికే ఓ టీజరో, ఫస్ట్ లుక్కో ఏదో ఒకటి వచ్చేంది. కరోనాతో అంతా తారుమారైంది. షూటింగ్ వాయిదా పడింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాక మళ్లీ షూటింగ్ మొదలవుతుంది.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా..

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా..

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ చిత్రం ఉండబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ చేసిన ట్వీట్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఎన్టీఆర్‌ను న్యూక్లియర్ ప్లాంట్‌తో పోల్చడం, మళ్లీ కలుస్తానని చెప్పడంతో ప్రాజెక్ట్ కన్ఫామ్ అయి ఉంటుందని అంతటా వార్తలు వచ్చేశాయి.

కన్నడలోనే తదుపరి చిత్రం..

కన్నడలోనే తదుపరి చిత్రం..

ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోపై కన్నడ ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత పేరు రావడానికి కారణం కన్నడ ఇండస్ట్రీ, కన్నడ ప్రజలు. నా డీఎన్‌ఏలోనే కన్నడ ఉంది. ఇప్పటికిప్పుడు నా తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పలేను. ఎందుకుంటే నా ఫోకస్ అంతా చాప్టర్2పైనే ఉంది. కానీ ఒక్కటి చెప్పగలను.. నా తదుపరి చిత్రాలన్నీ కన్నడలోనే ఉంటాయ'ని చెప్పుకొచ్చాడు.

Recommended Video

KGF Star Yash’s Next Movie Update | Filmibeat Telugu
ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై డైలామా..

ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై డైలామా..


ప్రశాంత్ స్టేట్మెంట్‌తో మళ్లీ డైలామా మొదలైంది. ఎన్టీఆర్ కాంబోలో ప్రశాంత్ చిత్రం వట్టి రూమర్స్‌గానే మిగిలిపోతాయా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కన్నడ, తెలుగులో ద్విభాషా చిత్రంగా చేయవచ్చని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X