ఇరవై ఏళ్లుగా ఆ టాలీవుడ్ హీరో ఫ్యాన్ ని.. సీక్రెట్ రివీల్ ప్రశాంత్ నీల్.. ఇక రచ్చ రచ్చే అంటున్న ఫాన్స్
KGF సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. అప్పటి వరకు కన్నడ సినీ పరిశ్రమ ఒకటి ఉంటుందని కూడా తెలియని చాలా ప్రాంతాలకు కన్నడ సినీ పరిశ్రమ సత్తా చూపించాడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమా చేసిన తర్వాత వెంటనే మరో సినిమా చేయకుండా అదే సినిమాకు సీక్వెల్ చేస్తూ ప్రశాంత్ నీల్ ఆసక్తి రేకెత్తించాడు. KGF 2 సినిమా విడుదల కోసం జరుగుతున్న ప్రమోషన్స్ లో ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video


KGF 1కి సీక్వెల్ గా
యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం KGF 2. KGF 1కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించడం, మరో కీలక పాత్రలో రవీనా టాండన్ నటించడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

20 ఏళ్ల నుంచి
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్న ప్రశాంత్ అది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ తాను ఎన్టీఆర్ కు దాదాపు 20 ఏళ్ల నుంచి అభిమాని అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనను ఒక అభిమానిగా ఎంతో ఆరాధిస్తా అని చెప్పుకొచ్చారు.

అందమైన ప్రయాణం
అలాగే సినిమా స్క్రిప్ట్ కూడా ఫైనల్ కాక ముందు చాలాసార్లు కలిశాను అని, ఆయనను మరి కొంచెం అర్థం చేసుకోవడం కోసం అన్ని సార్లు కలిశా అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ను మాత్రమే కాదని తాను సినిమా చేసే అందరు హీరోలను అలాగే కలుస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తో తనది ఒక అందమైన ప్రయాణం అని, కలిసిన కొద్దిరోజులకే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పుకొచ్చారు.

సినిమా కోసం ఎదురు చూస్తున్నా
అలాగే తాను చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని అందుకే ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నామని వెల్లడించారు. ఒక ఎన్టీఆర్ అభిమాని గా తాను కూడా మిగతా అందరు ఎన్టీఆర్ అభిమానులు లాగానే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ఏ జానర్లో తెరకెక్కబోతోంది అనే విషయం మీద మాత్రం ప్రశాంత్ నోరు విప్పలేదు.

పాన్ వరల్డ్ లో
అయితే ఈ విషయం విన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం గాల్లో తేలిపోతున్నారు. సాధారణంగా ఒక హీరోగా చూపించిన యష్ నే ప్యాన్ ఇండియా లెవెల్ లో నిలబెడితే తాను అభిమానించే ఎన్టీఆర్ను ఈసారి పాన్ వరల్డ్ లో నిలబెట్టినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. ప్రశాంత్ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ అందరి కలలు ఫలించి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అంతటి అద్భుత విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











