Prashanth Neel: రెండోసారి షారుఖ్ ఖాన్‌ను చావు దెబ్బ కొట్టిన ప్రశాంత్ నీల్... పగబట్టడా ఏంటి?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద దెబ్బకొట్టాడు. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఇదే టైంకి వచ్చాడు. అప్పుడు ఇలాగే షారుఖ్ నటించిన ఓ సినిమా కనుమరిగై పోయింది. ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి షారుఖ్ సినిమాకు పోటీగా తీసుకువచ్చాడు. మరి డంకీ వర్సెస్ సలార్ లో డంకీ మునిగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. అసలు వివరాల్లోకి వెళితే...

Recommended Video

హిస్టరీ రిపీట్ SRK కి గుణపాఠం నేర్పిన Prashanth Neel And Prabhas | Filmibeat Telugu

ఇప్పుడంతా సలార్ మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన సలార్ సినిమా హవానే కనబడుతుంది. బహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడక చాలా కాలమే అయింది. సాహో, రాదేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడం.. అది కూడా కేజీఎఫ్ సిరీసుల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో సలార్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపోతుంది.

Prashanth Neel Vs Sharukh Khan For Prabhas Salaar And Dunki Again Full Details Here

ఇక సలార్ సినిమాకు పోటీగా బాలీవుడ్ కింగ్ ఖాన్ నటించిన డంకీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డంకీ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అయి పర్వాలేదని టాక్ తెచ్చుకుంది. డంకీ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు. షారుఖ్ ఖాన్ ఇష్టపడి మరి ఈ సినిమాలో నటించారు. ఇక ఫస్ట్ డే డంకీ సినిమా పర్వాలేదనిపించినా.. ఇప్పుడు సలార్ రిలీజ్ అవ్వడంతో నార్త్ ప్రేక్షకులు డంకీకి హ్యాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మొదటి నుంచి డంకీ వర్సెస్ సలార్ అన్నట్లుగానే నడిచింది. ఒక్క రోజు గ్యాప్ లోనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రావడం.. అది కూడా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ హీరోల సినిమాలు కావడంతో అందరి దృష్టి వీరి సినిమాలపై పడింది. అయితే ఇప్పుడు సలార్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అటు నార్త్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ములేపుతున్నాయి. దీంతో షారుఖ్ డంకీకి భారీ నష్టం జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Prashanth Neel Vs Sharukh Khan For Prabhas Salaar And Dunki Again Full Details Here

ఇప్పటికే షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు డంకీ సినిమాతో రాగా.. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో వచ్చాడు. అయితే వీరిలో సలార్ వాయిదా పడుతుందని మొదటి నుంచి అనుకున్నారు. కానీ సలార్ రిలీజ్ వాయిదా వేయకుండా బాక్సాఫీస్ వద్దకు రాగా.. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఐదేళ్ల క్రితం షారుఖ్ ఖాన్ ఇదే టైంలో జీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక ఆ టైంలోనే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో వచ్చి షారుఖ్ ఖాన్ జీరో సినిమాకు భారీ నష్టాన్ని మిగిల్చాడు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్. ఇప్పుడు సలార్ సినిమాతో వచ్చిన ప్రశాంత్ నీల్.. షారుఖ్ ఖాన్ డంకీ సినిమాను దెబ్బకొట్టనున్నాడని నెటిజన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి షారుఖ్ ఖాన్ ను ప్రశాంత్ నీల్ పగబట్టినట్లు అలా చావు దెబ్బకొట్టాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X