Prashanth Varma: రాజమౌళి ఈగతో సినిమా తీస్తే... ప్రశాంత్ వర్మ కోతితో.. హీరో ఎవరంటే?

బాలీవుడ్ కు యష్ రాజ్ సినిమటిక్ యూనివర్స్... శాండిల్ వుడ్ కు ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ ఉంటే.. టాలీవుడ్ కు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించే చర్చ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో ఎలాంటి చిత్రాలు రాబోతున్నాయి... ఎవరు హీరో అనే వాటి గురించి హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక తాజాగా ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ సినిమా గురించి బయటపెట్టాడు. ఓ కోతితో సినిమా తీయబోతున్నట్లు వెల్లడించాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

తేజ సజ్జా హీరోగా... ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన చిత్రం 'హనుమాన్'. ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి భారీ విజయం సాధించింది. ఇప్పటికే హనుమాన్ సినిమా 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా థియేటర్లలో రచ్చరేపుతుంది. హనుమాన్ సినిమా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ బాగా కనెక్ట్ అయింది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది.

 Prashanth Varma Announced Movie With Raviteja As Monkey character in HanuMan Full Details Here

ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో 12 సినిమాలు రాబోతున్నట్లు ప్రకటించాడు . అందులో హనుమాన్, జై హనుమాన్, అధీరా, మహాంకాళి, బాలకృష్ణతో ఓ సినిమా.. ఇలా వరుస సినిమాతో బిజీగా ఉన్న సంకతి తెలిసిందే. ఇందులో సూపర్ హీరోల సినిమాలు, సూపర్ హీరోయిన్ సినిమాలు కూడా ఉండనున్నాయి. ప్రశాంత్ వర్మ ఓ పదేళ్లకు సరిపడా లైనప్ సెట్ చేసి పెట్టుకున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే హనుమాన్ మూవీ యూనిట్ ఓ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టగా తాజాగా మరోసారి సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ జరుపుకుంది.

ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంటుకు ప్రశాంత్ వర్మతో పాటు.. మేకర్స్ అందరూ పాల్గొన్నారు. హనుమాన్ సక్సెస్ ఈవెంట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా గురించి, సినిమాలో నటించిన వారి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హనుమాన్ సినిమాలో ఓ కోతి క్యారెక్టర్ ఉంటుందనే విషయం తెలిసిందే. కోటి అనే పాత్రతో ఈ కోతి పాత్ర హనుమాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ కోతి పాత్రకి రవితేజ వాయిస్ ఇచ్చారు.

హనుమాన్ సినిమాలో కోతి పాత్ర బాగానే హైలెట్ కాగా... ఇప్పుడు ఆ కోతి పాత్రతో తన యూనివర్స్ లో ఒక సినిమా తీస్తానని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ ఈవెంట్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... రవితేజ గారిని మూడేళ్ళ క్రితం అడిగానని తెలిపారు. హనుమాన్ సినిమాలో కోతికి వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఆయన్ని అప్పుడు అడగ్గా ఒప్పుకున్నారని చెప్పుకువచ్చాడు. సినిమా అయ్యాక మూడేళ్ళ తర్వాత వెళ్తే ఆయన సినిమా కూడా అదే సమయానికి విడుదల ఉందని తెలిసింది. అలాంటప్పుడు అడిగితే ఇస్తారా, ఇవ్వరా అనే సందేహంతో ఆయన్ని అడిగితే.. వెంటనే డబ్బింగ్ కు ఒప్పేసుకున్నారు.

 Prashanth Varma Announced Movie With Raviteja As Monkey character in HanuMan Full Details Here

ఇండస్ట్రీలో మనల్ని రవితేజలా సపోర్ట్ చేసేవాళ్లు తక్కువ మంది ఉంటారు. ఇలాంటివ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. రవితేజ గారు హనుమాన్ విజయంలో భాగం అయినందుకు థ్యాంక్స్. హనుమాన్ సక్సెస్ తర్వాత నాకొక చిన్న ఐడియా వచ్చింది. మా సినిమాటిక్ యూనివర్స్ లో ఆ కోతి క్యారెక్టర్ ని ముందుకి ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అని అనిపించింది. రవితేజ గారు ఒప్పుకుంటే ఆ కోటి క్యారెక్టర్ తోనే(కోతితో) ఒక సినిమా తీస్తాం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి ఈగతో సినిమా తీస్తే.. ప్రశాంత్ వర్మ కోతితో సిినిమా తీస్తాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X