జాంబీరెడ్డి తరువాత దర్శకుడి మరో కొత్త ప్లాన్.. ఓ సీక్వెల్ కథ కూడా రెడీ!
అ! సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజశేఖర్ తో కల్కి సినిమా చేశాడు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అయితే అంధించలేదు. ఇక మూడవసారి నెవర్ బిఫోర్ అనేలా జాంబీస్ జానర్ ను టచ్ చేస్తున్నాడు. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో మొదటిసారి ఒక జాంబీ ఫిల్మ్ ను తెరకెక్కించినట్లు ప్రమోట్ చేస్తూన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
రిలీజైన జాంబీ రెడ్డి ట్రైలర్ కు ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకు ఇండస్ట్రీలో ఓ వర్గం సెలబ్రెటీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రశాంత్ వర్మ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. యువ హీరోగా పరిచయం అవుతున్న తేజ సజ్జకు కూడా ఈ సినిమా రిజల్ట్ పైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ మరో కొత్త కాన్సెప్ట్ తో రెడీ అవుతాడట.

ఇంతవరకు తెలుగులో రాని డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేయబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రశాంత్ అ! సినిమాకు సీక్వెల్ ను కూడా రెడీ చేసుకున్నాడు కానీ ఇంతవరకు నిర్మాత దొరకలేదు. తప్పకుండా జాంబీరెడ్డి సినిమా అయితే ఊహాలకందని రేంజ్ లో థ్రిల్ చేస్తుందని అంటున్నారు. ఇక ఓ వర్గం ఆడియెన్స్ లో ఈ సినిమా అంచనాలనైతే పెంచేసింది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ ను అందుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో..


Click it and Unblock the Notifications











