Prashanth Varma జై హనుమాన్ పోస్ట్‌పోన్ - అనుపమ మాయలో పడిపోయిన ప్రశాంత్ వర్మ!
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు. చేసిన మొదటి సినిమాతోనే ఒక ప్రయోగాత్మక సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు ఏకంగా హనుమాన్ అనే సినిమా చేసి ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ఆయన చేస్తున్న ఒక మరో ప్రయోగాత్మక సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్లి పూర్తి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
చాలామందికి అర్థం కాలేదు
ప్రశాంత్ వర్మ నాని నిర్మించిన ఆ! సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నిజానికి ఆ! సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులకు చాలామందికి అర్థం కాలేదు. కానీ విషయం అర్థమైంది. తర్వాత భలే డైరెక్టర్ తెలుగు సినీ పరిశ్రమకు దొరికాడు అని అనుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన చేసిన కల్కి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

భారీ బ్లాక్ బస్టర్
వాస్తవానికి అది కూడా మంచి సబ్జెక్టే కాకపోతే బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఈ సినిమా తర్వాత తేజ హీరోగా చేసిన జాంబిరెడ్డి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన తేజతోనే హనుమాన్ అనే సినిమా చేశాడు. మొదట చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక భారీ బ్లాక్ బస్టర్ అయింది.
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ
సుమారు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 350 కోట్ల రూపాయలకు పైగా థియేటర్ కలెక్షన్స్ రాబట్టడమే కాదు ఓటీటీ ద్వారా మరిన్ని డబ్బులు కూడా నిర్మాతలకు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత జై హనుమాన్ అదేనండి హనుమాన్ రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.

ఒక లేడీస్ స్పెషల్ మూవీ
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ హనుమాన్ 2 రాయడం కంటే ముందే ప్రశాంత్ వర్మ చేస్తున్న ఒక లేడీస్ స్పెషల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. హనుమాన్ కంటే ముందే ఐదుగురు హీరోయిన్లతో ప్రశాంత్ వర్మ ఒక లేడీస్ స్పెషల్ మూవీ ఆక్టోపస్ మొదలుపెట్టాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ది మెయిన్ లీడ్ రోల్. ఎందుకు ఆగిందో తెలియదు కానీ సుమారు 65 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.
హనుమాన్ 2 కంటే ముందు
ఇప్పుడు మిగతా షూటింగ్ జరిపి హనుమాన్ 2 సినిమా కంటే ముందు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. ప్రేక్షకుల కంటే ముందు కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ కి పంపి అవార్డులు తెచ్చుకున్న తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మంచి రిజల్ట్ వస్తుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది చూడాలని ఏమవుతుందో.


Click it and Unblock the Notifications











