Jai HanuMan: జై హనుమాన్‌లో హనుమంతుడిగా ఆ బాలీవుడ్ హీరో... ప్రశాంత్ వర్మ సంచలనం
హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా తన సత్తా ఏమిటో చూపించాడు ప్రశాంత్ వర్మ. తీసింది మూడు సినిమాలే అయినా... ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి... ప్రభంజనం సృష్టించాడు ప్రశాంత్. ఇప్పుడు ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే జై హనుమాన్ సినిమా పనులు మొదలుపెట్టినట్లు చెప్పిన ప్రశాంత్.. తాజాగా జై హనుమాన్ హీరో ఎవరో చెప్పేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
అ.. సినిమాతో సినిమా పరిశ్రమలోని వారికి షాక్ గురిచేశాడు. చిన్న కాన్సెప్టుతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత తేజ సజ్జాతో కలిసి జాంబిరెడ్డి తీశాడు. కరోనా టైంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ అదే హీరోతో కలిసి హనుమాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది.

హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూ నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా... 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి... రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పటికే నార్త్ అమెరికాలో కూడా స్టార్ హీరోల రికార్డులు కొల్లగొడుతూ... సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా చివర్లో జై హనుమాన్ సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.
అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించేది ఎవరంటూ అభిమానుల్లో చర్చ మొదలు అయింది. మొదట హనుమాన్ చిత్రంలో ఆ కళ్లను చూసి చిరంజీవి అన్నారు. ఆ తర్వాత సినిమా చూసి... రానా హనుమంతుడిగా.. రాముడిగా రామ్ చరణ్ అంటూ వార్తలు వచ్చాయి. రానా హనుమంతుడిగా ఉండబోతున్నట్లు దాదాపు కన్మార్మ్ అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ క్యారెక్టర్ పై ప్రశాంత్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'జై హనుమాన్'లో హనుమంతుడిగా బాలీవుడ్ హీరోను తీసుకోనున్నట్లు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చారు. ఇందుకు సంబంధించి బాలీవుడ్ హీరోల నుంచి ఆడిషన్స్ కూడా చేస్తున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరో ప్రకటించనున్నట్లు వివరించాడు. దీంతో ఆ హీరో ఎవరా అంటూ నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.
ఇక 'హనుమాన్'కు సీక్వెల్‌గా వస్తున్న 'జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమయిపోయిందని చెప్పిన ప్రశాంత్ వర్మ... ఇక క్యాస్ట్ అండ్ క్రూ పనిలో పడినట్లు తెలిపారు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ 'జై హనుమాన్' కోసం ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఇక ఈ చిత్రం 2025లో రాబోతుంది. ఈలోపు అధిరా, సుపర్ హీరోయిన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రశాంత్ వర్మ.

ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో 12 సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే హనుమాన్ రాగా.. తర్వాత అధిరా, మహంకాళి సినిమాలు రానున్నాయి. ఇక వీటితో పాటు.. మన ఇతి వృత్తాలను బేస్ చేసుకుని సూపర్ హీరో, హీరోయిన్ సినిమాలు చేయనున్నట్లు చెప్పుకువచ్చాడు ప్రశాంత్ వర్మ. మరి ప్రశాంత్ ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











