జాంబిరెడ్డి సీక్వెల్.. ఈసారి అంతకుమించి భయాన్ని చూపిస్తాడట!

యువ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా ట్రై చేస్తుంటాడు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే అతని కంటెంట్ చూసి చాలా మంది నిర్మాతలు ఛాన్సులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇక మొత్తానికి జాంబీ రెడ్డి సినిమాతో పరవాలేదు అనిపించిన ప్రశాంత్ వర్మ ఈసారి అంతకు మించి అనేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ ఆ తరువాత చేసిన కల్కి సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక ఇప్పటివరకు తెలుగులో ఎవరు ట్రై చేయని తరహాలో జాంబీస్ కాన్సెప్ట్ తో రాగా ఓ వర్గం జనాలను ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమా హిట్ టాక్ అందుకోగానే దర్శకుడు ప్రశాంత్ తప్పకుండా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

Prashanth varma upcoming movie Zombie Reddy’s sequel latest update

ఇక ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. జాంబీ రెడ్డి సీక్వెల్ అంతకు మించి అనేక థ్రిల్ ఇస్తుందట. ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పనులన్ని కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను సమంతతో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అందులో నిజం లేదు. దర్శకుడు ప్రశాంత్ సమంతతో ఒక సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే. కానీ అది వేరే స్టోరీ. జాంబీ రెడ్డి 2 అనంతరం మంచి నిర్మాత దొరికితే వెంటనే ఆ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X