వివేక్ ఆత్రేయ వల్లనే అద్భుతంగా మ్యూజిక్.. ప్రశాంత్ విహారీ
Recommended Video

పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి. కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్‌గా మెంటల్ మదిలో చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 24న రిలీజ్ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో చిన్న సినిమా పెద్ద విజయం'' అనే క్యాప్షన్ పేరుతో ఈ చిత్రం సూపర్ సక్సెస్ మీట్ జరిగింది.
సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి మాట్లాడుతూ.. ఈ సినిమా సంగీతం అద్భుతంగా రావటానికి కారణం వివేక్ ఆత్రేయ ఇచ్చిన సలహాలు, సూచనలే. ప్రతి సన్నివేశాన్ని పూర్తిగా అర్ధం అయ్యేలా వివరించడంతోపాటు ఒక పాట కంపోజ్ చేసేప్పుడు డుప్ లిరిక్స్ కావాల్సి వుంటుంది. ఆ పాటని వివేక్ రాసేవాడు. ఆ పాట కంపోజ్ చేసే సమయంలో నా పక్కనే ఉండి నన్ను ఉత్సాహపరిచేవాడు అని అన్నారు.


Click it and Unblock the Notifications











