డైరక్టర్ తేజా గంటసేపు ట్రాన్స్ లో....
దర్శకుడు తేజ ఈ సినిమా చూసి ఒక గంటపాటు ట్రాన్స్‌లో ఉండిపోయానని చెప్పడం, తన సినిమాతో అంత ప్రభావాన్ని కలిగించానా..అని తనకే ఆశ్చర్యంగా ఉందని దర్శకుడు దేవ కట్టా అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రస్థానం' చిత్రం ప్రమోషన్ లో భాగంగా యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. అలాగే జాతీయస్థాయి పురస్కారాలకు అర్హత పొందే స్థాయి తెలుగు సినిమాల్లో ఉండట్లేదన్న వ్యాఖ్యలకు మా 'ప్రస్థానం' కొంతమేరకు జవాబు చెబుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. అలాగే 'కథ మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది. మనకు అన్ని అంశాలను కథలు నేర్పుతాయి. మా సినిమాలోనూ కథను నమ్ముకున్నాం. ఫలితమిచ్చింది. ఇందులో కనిపించే ప్రతి పాత్రా, వినిపించే ప్రతి మాటా అర్థవంతమైనదే. మనం ఏం విత్తుతామో అదే మొలుస్తుందన్న అంశాన్ని అందంగా తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, శివ పాత్రధారి సందీప్, బాషా పాత్ర చేసిన మధు తదిదరులు పాల్గొన్నారు. ఇక రెండు రోజుల క్రిందట దర్శకులు కృష్ణవంశీ, క్రిష్, కెమెరామెన్ ఛోటాకె నాయుడు, అల్లరి నరేష్ ఈ చిత్రాన్ని చూసి ప్రశంశించారు.


Click it and Unblock the Notifications











