నేత్రదానం చేసిన ప్రస్థానం హీరో శర్వానంద్..!
యువ కథనాయకుడు శర్వానంద్ ను ఇక నుంచి నేత్రానంద్ అని పిలవొచ్చు. ఎందుకంటే అతను రెండు నేత్రాల్ని దానం చేసాడు. దానాలన్నిటిలోకీ నేత్రదానం గొప్పదంటారు. గొప్ప మనసున్న వాళ్లే నేత్రదానం చేసి, మరో ఇద్దరికి చూపుని ప్రసాదించగలుగుతారు. తనకూ అటువంటి మనసుందని నిరూపించాడు యువ కథానాయకుడు శర్వానంద్.
లిటిల్ వేస్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ నిన్న హైదరాబాదు బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో, మరణానంతరం తన రెండు కళ్ళను దానం చేస్తున్నట్టుగా శర్వానంద్ రాసిచ్చాడు. నేత్ర దానం చేసి చీకట్లో వున్న వారికి వెలుగును ప్రసాదించాలని ఆయనీ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు. పలువురి ఆదర్శంగా నిలిచాడు. తన తల్లిదండ్రులు కూడా నేత్రదానం చేశారని శర్వానంద్ చెప్పాడు.
నేత్రదానం పట్ల మన సమాజంలో ఇప్పటికీ సరైన అవగాహన లేదు. శర్వానంద్ లాంటి హీరోలు ఈ సత్కార్యానికి పూనుకోవడం వల్ల దీనిపై కొంతమందికైనా అవగాహన కలుగుతుంది. ఎందుకంటే మన దేశంలో లక్షలాది మంది కంటిచూపు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్నారు. వారికి ఈ నేత్రదానం ఓ వరంలాంటిది..!
ఇక శర్వానంద్ ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో ఓ కీలకమైనటువంటి పాత్ర పోషించనున్నాడు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని పరాస్ జైన్ ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











