కంగ్రాట్స్ ... 'ప్రస్థానం' దేవకట్టా
వెన్నెల చిత్రంతో పరిచయమైన దేవకట్టా తన మలి చిత్రంగా 'ప్రస్థానం' రూపొందించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఆ చిత్రం విజయం సాధించకపోయినా ఓ వర్గం ప్రశంసలు పొంది మంచి మార్కులే వేయించుకుంది. ఇక తాజాగా ఆ చిత్రం నవంబరు 22 నుంచి గోవాలో మొదలుకానున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సావల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఇండియన్ పనోరమా విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. రాజకీయ రంగం నేపథ్యంగా సాగే కథతో 'ప్రస్థానం' సినిమా రూపుదిద్దుకొంది. ఈ చిత్రంలో శర్వానంద్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.అలాగే ఈ సంవత్సరం పనోరమా విభాగానికి ఎంపికైన తెలుగు చిత్రం ఇదొక్కటే కావటం మరో విశేషం. దర్శకుడు ఎన్.చంద్ర అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ వివిధ భాషల నుంచి 140 చిత్రాలను పరిశీలించింది. 26 చిత్రాల్ని ఎంపిక చేశారు.ఈ సందర్బంగా దేవకట్టాకు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
ప్రస్ధానం ఇండియన్ పనోరమ శర్వానంద్ సాయికుమార్ గోవా prasthanam indian panorama sarwanand sai kumar goa


Click it and Unblock the Notifications