twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ.. ఆ కులం వారే కమిటీలు నిర్వహిస్తారా? ప్రతాని

    By Rajababu
    |

    వెరీ గుడ్ సినీ స్కూల్ పతాకంపై ఆది, ఆశ్లేష హీరో హీరోయిన్స్ గా ప్రభాకర్ ఇప్పు దర్శకత్వంలో రవికుమార్ గంజి నిర్మించిన మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'సహచరుడు'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మధురా ఆడియో ద్వారా ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించగా, ఆడియో సీడీని లయన్ సాయి వెంకట్ విడుదల చేశారు.

    చిన్న సినిమాలు రావాలి

    చిన్న సినిమాలు రావాలి

    అనంతరం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. "చిన్న సినిమాలు హిట్ అయ్యాకే పెద్ద సినిమాలుగా మారుతాయి. డైరెక్టర్ ఇప్పు ప్రభాకర్ సినిమాను బాగా తెరకెక్కించారని అర్ధం అవుతోంది.. లిరిక్స్ రైటర్ రామారావు త్వరలో మా బ్యానర్ లో రానున్న కబడ్డీ చిత్రంలోని పాటలకు లిరిక్స్ అందించారు. అద్భుతంగా వచ్చాయి.. సహచరుడు లాంటి చిన్న సినిమాలు రావాలి.. ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీ కు వస్తారు.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది.. మేము కూడా ఎన్నో చిన్న సినిమాలకు మా వంతు సహకారాన్ని అందించాము. అలానే ఈ సినిమాకు కూడా అందిస్తామని చిత్ర యూనిట్ కు తెలియచేస్తున్నాం అని అన్నారు.

    క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ

    క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ

    సహచరుడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఒక కులం వారే కమిటీలు నిర్వహించడం సరికాదు. ఇండస్ట్రీ అంటే అందరిదీ. అందరికీ సమాన హక్కులు కలిపించాలి. కళాకారులు అందరూ సమానమని భావించాలి. టాలెంట్ ను బట్టి ప్రోత్సహించాలి కానీ కులాల వారీగా కాదు. ఈ ధోరణి కొందరు పెద్దలు గ్రహించాలి. మారాలి. లేదంటే ఈ విధానంపై నేను పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతామని ఈ సందర్భంగా తెలియచేస్తాను" అని అన్నారు.

    90 శాతం తెలుగు హీరోయిన్స్

    90 శాతం తెలుగు హీరోయిన్స్

    సాయి వెంకట్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ చాలా కష్టపడి సినిమా చేసి ఆడియో విడుదల వరకు తీసుకొచ్చారు.. ఈ చిత్ర రిలీజ్ బాగా జరిగేలా మా వంతు కృషి చేస్తామని తెలియచేస్తున్నా. ఇటీవల కాలంలో చిన్న సినిమాలలో 90 శాతం తెలుగు హీరోయిన్స్ వస్తున్నారు. సంతోషకరమైన విషయం. ఈ సినిమాను ప్రేక్షకులు అన్నివిధాలా ప్రోత్సహించాలని కోరుతున్నా" అన్నారు.

    ఎనిమిదేళ్ల కష్టమే సహచరుడు

    ఎనిమిదేళ్ల కష్టమే సహచరుడు

    దర్శకుడు ఇప్పు ప్రభాకర్ మాట్లాడుతూ.. "ఎనిమిది సంవత్సరాల కష్టమే ఈ సహచరుడు చిత్రం.. రామారావు గారు 2 ఇయర్స్ కష్టపడి లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ 1 1/2ఇయర్ కష్టపడి మంచి మ్యూజిక్ ను అందించారు... ఒక సినిమా వలన ప్రేక్షకులు చెడిపోకూడదు అనేదే నా ఉద్దేశ్యం.. హృదయాన్ని పిండేసే మెసేజ్ ఈ సహచరుడు ద్వారా చెప్పాము.. ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

    ట్రెండ్‌కు తగ్గ మ్యూజిక్

    ట్రెండ్‌కు తగ్గ మ్యూజిక్

    ట్రెండ్ కి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలని మొదట అనుకున్నాం. బట్ అందరికీ అర్థమయ్యే లిరిక్స్ తో ట్యూన్ చేసాము. అందరికీ తప్పకుండా నచ్చుతాయని భావిస్తున్నాం అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్.

     పాత్ర కోసం బరువు పెరిగాను

    పాత్ర కోసం బరువు పెరిగాను

    హీరో ఆది మాట్లాడుతూ.. మొదట 70కేజీ లు ఉండేవాడిని.. ఈ పాత్ర కోసం నన్ను బరువు పెరగమని చెప్పారు దర్శకుడు.. ఆశ్చర్య పోయా కానీ సినిమాలో చూసుకున్న తరువాత అర్థమయ్యింది.. పాత్రలో ఫిట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు.. అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని చెప్పారు..
    హీరోయిన్ ఆశ్లేష, చిత్ర నిర్మాత రవి కుమార్ గంజి, లిరిక్ రైటర్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    English summary
    Sahacharudu audio released at Hyderabad today. Prabhakar Ippu is the director for the movie. This audio was released by Telangana Film Chamber president Pratani Ramakrishna Goud. while speaking to media in this function, Rama Krishna goud made sensational comments. He said one cast is infulencing the whole tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X