twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు నటన రాదనే చిరంజీవి నన్ను పిలవలేదేమో: సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్

    By Manoj
    |

    వెండితెరపై తిరుగులేని చెరిగిపోని చిత్రాల్లో నటించిన సీనియర్ నటులంతా ఓ చోట చేరితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ తమ ఇండస్ట్రీల్లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న 1980-90 అగ్రతారలు 'క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌' పేరుతో ప్రతి ఏటా వేడుకలు జరుపుకుంటారు. ఈ సారి ఆ వేడుకలకు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. గత తొమ్మిదేళ్లుగా రకరకాల ప్రదేశాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. పదో వార్షికోత్సవం సందర్భంగా ఈ సారి చిరు నివాసానికి వేడుకలు షిఫ్ట్‌ అయ్యాయి. ఈ వేడుకకు ఎంతో మంది సినీ తారలు హాజరయ్యారు. కానీ, కొందరు రాలేకపోయారు. అయితే, తాజాగా ఓ సీనియర్ నటుడు తనకు ఆహ్వానం అందలేదని చెప్పి బాంబు పేల్చాడు. ఇంతకీ ఎవరాయన.? వివరాల్లోకి వెళితే..

     ఈసారి మెగా సంబరంగా పార్టీ

    ఈసారి మెగా సంబరంగా పార్టీ

    నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ ఇంట్లోనే తన పాత స్నేహితులతో కలిసి అదిరిపోయేలా పార్టీ చేసుకున్నారాయన. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ సహా మలయాళం, కన్నడ నుంచి మొత్తం 40 మంది తారలు పాల్గొన్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, మోహన్‌లాల్‌లతో ఖుష్బూ, రాధిక, సుమలత, నదియా, భాగ్యశ్రీ, రమ్యకృష్ణ, జయసుధ, లిజీ, పూర్ణిమ భాగ్యరాజ్.. భానుచందర్, నరేష్, సురేష్ లాంటి చాలా మంది స్టార్స్ ఈ పార్టీకి వచ్చారు.

    రీయూనియన్ పార్టీకి వీళ్లు రాలేదు

    రీయూనియన్ పార్టీకి వీళ్లు రాలేదు

    ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పార్టీలో దక్షిణాది స్టార్ హీరోలు కమల్ హాసన్, రజినీ కాంత్ హాజరు కాలేదు. అలాగే, తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ సైతం గతంలో జరిగిన అన్ని పార్టీలకు వీళ్లు వచ్చినప్పటికీ దీనికి మాత్రం రాలేదు. దీంతో అందరూ వీళ్ల గైర్హాజరుపై చర్చించుకుంటున్నారు. వీరితో పాటు జీవిత రాజశేఖర్ దంపతులతో పాటు పలువురు సీనియర్ నటులు కూడా ఇందులో కనిపించకపోవడం గమనార్హం.

    నన్ను ఆహ్వానించలేదన్న స్టార్

    నన్ను ఆహ్వానించలేదన్న స్టార్

    తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రతాప్ పోతెన్ రీయూనియన్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఆ పార్టీకి వచ్చే అర్హత నాకు లేదేమో. నేను మంచి నటుడిని, దర్శకుడిని కాదని భావించి చిరంజీవి నన్ను పిలవలేదేమో. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది' అని ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    #CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
    ఇంతకీ ఎవరాయన..?

    ఇంతకీ ఎవరాయన..?

    ప్రతాప్ పోతెన్ దక్షిణాది సినిమాల్లో నటించారు. అంతేకాదు, ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా తెలుగులో వచ్చిన ‘ఆకలి రాజ్యం', ‘కాంచన గంగ', ‘జస్టిస్ చక్రవర్తి', ‘మరోచరిత్ర' సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. ఈ క్రమంలో ఆయన చిరంజీవిపై వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

    English summary
    Pratap K. Pothen, popularly known as Pratap, is an Indian actor, director, writer, and producer who has acted in about 100 films. He has acted in Malayalam, Tamil and Telugu as well as Hindi films. He directed films in Tamil, Malayalam and Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X