మా ‘సం’బంధం నిజమే...కానీ అది జరుగలేదు
ఏ మాయ చేసావె హిందీ రీమేక్ 'ఏక్ దివానా థా' చిత్రంలో కలిసి నటించిన ప్రతీక్ బబ్బర్, అమీజాక్సన్ మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరికి రహస్యంగా పెళ్లి కూడా జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ప్రతీక్ ఎట్టకేలకు స్పందించాడు. మేము ఇద్దరం కలిసి ఉంటున్నమాట వాస్తవమే అని ఒప్పుకున్నాడు.
అయితే తమకు రహస్యంగా పెళ్లి జరిగిందని వస్తున్న వార్తలను మాత్రం ప్రతీక్ ఖండించారు. పెళ్లి అనేది చాలా లాంగ్ ప్రాసెస్, తమకు రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తామిద్దరం ప్రేమ పక్షులమనే విషయం అందరికీ తెలిసేలా ఈ జంట భుజాలపై టాటూ కూడా వేయించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రతీక్ ప్రకటనను బట్టిచూస్తే త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే వీరి బంధం వెనక మరో వాదన కూడా ఉంది. బిపాసా, జాన్ అబ్రహం పరిశ్రమకు వచ్చిన కొత్తలో పాపులర్ కావడానికి ఒకరితో ఒకరు ఎఫైర్ పెట్టుకున్నారు. పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రచారం చేసి పాపులారిటీ వచ్చాక ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా వారి బాటలోనే ప్రతీక్, అమీ నడుస్తున్నారని కొందరంటున్నారు.
'మదరాసు పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా భారతీయ వెండి తెరకు పరిచయమైన బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపికయింది. ఎవడు సినిమా హిట్టయితే తెలుగులోనూ అమీ జాక్స్ బిజీ హీరోయిన్‌గా మారొచ్చేమో..


Click it and Unblock the Notifications











