ఛార్మి 'ప్రతిఘటన' విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్‌: నేటి రాజకీయాలపై వ్యగ్యాస్త్రంగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన చిత్రం 'ప్రతిఘటన'. ఒడిషాలో ఇద్దరు యువతులపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రవర్తన, రౌడీల తీరు, ఓటర్లను చైతన్యపరిచే పలు అంశాలను ఈ చిత్రంలో పొందుపర్చినట్లు తమ్మారెడ్డి తెలిపారు. ప్రధాన పాత్రలు పోషించిన ఛార్మి, రేష్మిల నటన అందరిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఛార్మి ప్రధాన పాత్రలో చరిత్ర చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'ప్రతిఘటన' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ అత్యాచార ఉదంతం ప్రధానాంశంగా చిత్రాన్ని నిర్మిస్తున్నామని, కథ నచ్చడంతో అనేకమంది సాంకేతిక నిపుణులు ఉచితంగా పనిచేస్తున్నారని, ఛార్మికూడా పారితోషికం లేకుండా నటిస్తోందని తెలిపారు.

‘Prathigatana’ release date announced

చిత్ర దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఒరిస్సాలో జరిగిన రూప్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెలుపుతూ, మనుషులు మారితేనే సమాజం, నాయకులు కూడా మారతారని ఇందులో చెపుతున్నాం. మంచి రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ ఉంటే సమాజం ఏ విధంగా ఉంటుందనేది అద్దం పట్టేలా చూపిస్తున్నాం. సామాజిక విలువలతో పాటు,వ్యాపారాత్మక విలువలు కూడా సినిమాలో ఉంటాయి. బాధ్యతగల జర్నలిస్టుగా ఛార్మి నటిస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. భారతీయ మీడియాకు సినిమాను అంకిత మిస్తున్నాము అన్నారు.

నేటి సమాజంలో రక్షణ లేని స్ర్తి వ్యవస్థకు అద్దంపట్టేలా రూపొందుతున్న ప్రతిఘటనలో జర్నలిస్టుగా ఛార్మి నటిస్తుండగా, నిర్భయగా రేష్మా నటిస్తోందని, నిర్మాణాంతర కార్యక్రమాలు చురుకుగా పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానిక సంగీతం:కీరవాణి, కెమెరా:ఎస్.గోపాల్‌రెడ్డి, నిర్మాత, దర్శకత్వం:తమ్మారెడ్డి భరద్వాజ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X