twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూపిస్తాం...కానీ ఆ ఉద్దేశ్యంతో చూడొద్దంటున్న చార్మి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చరితచిత్ర పతాకంపై చార్మి కీలకపాత్రధారిణిగా తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రతిఘటన'. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశరాజధాని ఢిల్లీలో జరిగి నిర్భయ ఘనటను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈచిత్రం రూపొందుతోంది.

    ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న చార్మికి విచిత్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. 'ప్రతిఘటన' చిత్రం గురించి చార్మి మాట్లాడుతూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని సరైన నేతలను ఎన్నుకుంటే మహిళలకు రక్షణ ఏర్పడుతుందని చెప్పుకొచ్చింది. అయతే ఓ అభిమాని చార్మిని ప్రశ్నిస్తూ.... ఓ వైపు హాట్ హాట్ గ్లామర్ రోల్స్ చేస్తూ 'ప్రతిఘటన' లాంటి సినిమాల ద్వారా ప్రజలకు సందేశం అంటూ మాట్లాడుతున్నారు, ఇది ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.

    'Prathighatana' Movie to Release on 18 April

    ఈ ప్రశ్నకు చార్మి తెలివిగా సమాధానం ఇచ్చింది..... గ్లామర్ రోల్స్ చేసినా చూసే వాళ్ళ మైండ్ సెట్ మారాలని, తప్పుడు ఉద్దేశ్యంతో చూడకూడదని సమాధానమిచ్చింది. చార్మి వ్యాఖ్యలపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మరి చార్మి వ్యాఖ్యలపై మీ ఉద్దేశ్యం ఏమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

    ప్రతిఘటన చిత్రం విశేషాల్లోకి వెళితే...ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి క‌ట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్ వారు ఈ చిత్రానికి U/A ధృవీక‌ర‌ణ ప‌త్రం జారీ చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈచిత్రంలో చార్మి మహిళా జర్నలిస్టుగా నటిస్తోంది. అత్యాచార బాధితురాలి పాత్రలో రేష్మ నటిస్తోంది.

    English summary
    The release date of Charmi’s upcoming film Prathighatana has been pushed to April 18. Earlier, the makers were planning to release the film on April 4th; however, Charmee has confirmed that the film will release only on April 18.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X