twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతిఘటన ట్రైలర్లో ఇండైరెక్టుగా ఎవరిపై సెటైర్లు వేసారు? (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఆ పార్టీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేసారు...ఇపుడు ఆ పార్టీలోనే మీ పార్టీని ఎందుకు కలిపారు? అంటూ ఓ జర్నలిస్టు ఓ నాయకుడిపై ప్రశ్నల వర్షం, మరో రాజకీయ నాయకుడు తన సొంత లాభం చూసుకుని తను స్థాపించిన పార్టీని మరో పెద్ద పార్టీలో విలీనం చేయడానికి ఓకే అంటాడు.........ఇవన్నీ తాజాగా విడుదలైన 'ప్రతిఘటన' చిత్రానికి సంబంధించిన ట్రైలర్లో కనిపిస్తున్న సన్నివేశాలు.

    ట్రైలర్లోని కొన్ని సీన్లు పరిశీలిస్తే...చిరంజీవి రాజకీయ జీవితం గుర్తొస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతంలో ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి 2009లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేంద్ర మంత్రి పదవిని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

    Prathighatana trailer Released

    'ప్రతి ఘటన' సినిమా వివరాల్లోకి వెలితే...చరితచిత్ర పతాకంపై చార్మి కీలకపాత్రధారిణిగా తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రతిఘటన'. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశరాజధాని ఢిల్లీలో జరిగి నిర్భయ ఘనటను ప్రధానంగా ఫోకస్ చేయడంతో పాటు ఇతర సామాజిక, రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ఈచిత్రం రూపొందింది.

    ఏప్రిల్ 18వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని చార్మి ఎంతో నమ్మకంగా ఉంది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని, నేటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. ఈచిత్రంలో చార్మి మహిళా జర్నలిస్టుగా నటిస్తోంది. అత్యాచార బాధితురాలి పాత్రలో రేష్మ నటిస్తోంది.

    <center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/L0HRaOrgOPc" frameborder="0" allowfullscreen></iframe></center>

    English summary
    Prathighatana trailer Released. Charmi and Reshma are acting in the key roles in a film titled 'Pratighatana'. Tammareddy is the director and is also producing the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X