For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రత్యూషది ప్లాన్డ్ మర్డర్.. హంతకులు వారే.. హత్య వెనుక కారణం అదే..

  By Rajababu
  |

  15 ఏళ్ల క్రితం అప్పుడప్పుడే సినీ నటిగా ఎదుగుతున్న ప్రత్యూష మరణం దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఆమె మరణం వెనుక అనేక ఆరోపణలు వినిపించాయి. సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్లే తాను ఏమి చేయలేకపోయాను అని ప్రత్యూష తల్లి సరోజిని గోడు వెల్లబోసుకొన్నది. 15 ఏళ్లుగా పట్టువదలిని విక్రమార్కుడిలా ఆమె ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది. ప్రత్యూష మర్డర్ ప్రణాళిక ప్రకారమే జరిగింది అని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ఆ వివరాలు మీ కోసం..

  జెమినీ టీవీ పోటీ కోసం

  జెమినీ టీవీ పోటీ కోసం

  ప్రత్యూషకు నటి కావాలనే కోరిక ఉండేది. ఓ సారి జెమిని టీవీలో ఓ కాంటెస్ట్ కోసం స్నేహితులతోపాటు ఫోటోలు పంపించింది. అయితే ముందు నేను వద్దని అన్నాను. కానీ నా బంధువులు సెలెక్ట్ అయిన తర్వాత చూద్దాం. అవకాశాలు రావడమే చాలా కష్టం. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు అని బంధువులు చెప్పారు.

  ప్రత్యూషతో ఆర్థిక కష్టాలు తీరవచ్చు

  ప్రత్యూషతో ఆర్థిక కష్టాలు తీరవచ్చు

  మగ దిక్కులేని కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వ వచ్చు. ప్రత్యూష రాణిస్తే ఆర్థికంగా కష్టాలు తీరుతాయి. భవిష్యత్ ఆర్థిక అవసరాలు తీరడానికి అవకాశం ఉంటుంది అని నచ్చచెప్పారు. దాంతో నేను ఓకే అన్నాను.

  రాఘవేంద్రరావు ఆశీస్సులు

  రాఘవేంద్రరావు ఆశీస్సులు

  ఆ తర్వాత జెమినీ టీవీ పోటీలో సెలెక్ట్ అయింది. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు వద్దకు వెళ్లాం. పాపలో మంచి ప్రతిభ ఉంది. చక్కగా ఉంది. డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించు. నటనలో ట్రైనింగ్ ఇప్పించు. ప్రత్యూష బాగా డెవలప్ అవుతుంది అని రాఘవేంద్రరావు ప్రోత్సహించారు.

  సిద్ధార్థ్ రెడ్డితో అఫైర్

  సిద్ధార్థ్ రెడ్డితో అఫైర్

  జెమినీలో సెలెక్ట్ కావడానికి ముందే ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంది. డిగ్రీ చదువుతుండగానే వారి మధ్య ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యూష చేరితే సిద్ధార్థ్ రెడ్డి కూడా చేరాడు. వారి మధ్య ఏదో ఉందని అనుమానం వచ్చి అడిగితే మా మధ్య అఫైర్ ఉంది అని ప్రత్యూష చెప్పింది.

  వారి ప్రేమకు ఓకే చెప్పాను

  వారి ప్రేమకు ఓకే చెప్పాను

  ప్రత్యూష ప్రేమకు నేను అడ్డం పడలేదు. ముందు కెరీర్ చూసుకోండి ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పాను. ఈ లోగా ప్రత్యూషకు సినీ అవకాశాలు పెరిగిపోయాయి. దాంతో ప్రత్యూష బిజీగా మారింది. ఇది సిద్ధార్థ్ రెడ్డికి కంటగింపుగా మారింది.

  సిద్ధార్థ్ రెడ్డికి అది నచ్చలేదు

  సిద్ధార్థ్ రెడ్డికి అది నచ్చలేదు

  ప్రత్యూషకు బాగా పాపులారిటీ రావడం సిద్ధార్థ్‌రెడ్డికి నచ్చలేదు. అసూయతో రగిలిపోయాడు. మొదట్లో అతను బాగా ఇష్టపడేవాడు. వారి మధ్య గొడవలు వచ్చాయి. వారు గొడవలు పడటం చూసి నేను వారిని సముదాయించాను.

  సిద్ధార్థ్‌రెడ్డి కుటుంబం నో

  సిద్ధార్థ్‌రెడ్డి కుటుంబం నో

  ఈలోగా ప్రత్యూషతో ప్రేమను సిద్ధార్థ్ కుటుంబం తిరస్కరించింది. సినీ నటి అయితే ఒప్పుకోమని చెప్పి ఆయనపై ఒత్తిడి పెంచారు. దీంతో ప్రత్యూష ఎక్కడ దూరం అయిపోతుందో అనే కాంప్లెక్స్ సిద్ధార్థ్‌రెడ్డిని వెంటాడింది.

  కొంతమందితో రేప్ చేయించి

  కొంతమందితో రేప్ చేయించి

  ప్రత్యూష తనకు ఎక్కడ దక్కకుండా పోతుందనే ఒకే కారణంతో నా కూతురు మరికొంత మందితో రేప్ చేయించి చంపాడు. ప్రేమలో రాక్షసత్వం ఉంటుందా? తనకు నచ్చకపోతే ప్రేమించిన అమ్మాయిని రేప్ చేయించడం ఎక్కడా చూడలేదు.

  సిద్ధార్థ్ దారుణానికి పాల్పడ్డాడు

  సిద్ధార్థ్ దారుణానికి పాల్పడ్డాడు

  ప్రత్యూషకు పేరు, పలుకుబడి, డబ్బు వస్తుందన్న ఏకైక కారణంతో సిద్ధార్థ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడింది ఐదుగురు, ఆరుగురు ఉన్నారు. మంత్రుల, రాజకీయ నేతల పిల్లలు ఉన్నారు అని మీడియాలో వచ్చిన వార్తలతో తెలుసుకొన్నాను. కానీ సాక్ష్యాలు లేకపోవడంతో నేను ఏమి చేయలేకపోయాను. కేవలం సిద్ధార్థ్ రెడ్డిపైనే కేసు పెట్టి చేతులు దులుపుకొన్నారు.

  ప్రత్యూషది ప్లాన్డ్ మర్డర్

  ప్రత్యూషది ప్లాన్డ్ మర్డర్

  ప్రత్యూషది ప్రీ ప్లాన్డ్ మర్డర్. అత్యంత దారుణంగా వేధించి చంపారని నేను చెప్పగలను. ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలో చూశాను. అప్పుడు సోషల్ మీడియా లేదు. ఇన్ని టెలివిజన్ ఛానెళ్లు లేవు కాబట్టి ప్రత్యూష మరణానికి ప్రాధాన్యం దక్కలేదు.

  English summary
  Actress Prathyusha death become sensational in the media. Her death becomes mystery even today. Her mother Sarojini fighting for justice since 15 years. In this occassion, She interviewd to one youtube Channel recently. In that occassion, She said, Her daughter raped thirce in moving cars.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X