twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం ఐడియా తల్లీ : ఆత్మహత్యలు ఆపాలంటే ..ఫ్యాన్ లు బ్యాన్ చేయాలా

    By Srikanya
    |

    ముంబై: చిన్నారి పెళ్లికూతురు టీవి సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ఐటమ్ గాళ్‌ రాఖీ సావంత్ కొన్ని ఊహించని విషయాలు మీడియావద్ద వెల్లడించింది. అవి నిజమో కాదో కానీ మరో సంచలన వ్యాఖ్యం చేసాననుకుని ప్రధానికో సూచన చేసి అందరినీ మాట్లాడుకునేలా చేసింది.

    Pratyusha Banerjee suicide: Ban ceiling fans to save India’s daughters, Rakhi Sawant requests Modi

    రాఖీ సావంత్ చెప్పిన దాని ప్రకారం.. ప్రత్యూషను రాహుల్ రాజ్ సింగ్ నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని, ప్రత్యూషను టార్చర్ పెట్టొద్దని రాహుల్ కు చాలాసార్లు చెప్పానని తెలిపింది. ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రత్యూషను హత్య చేశారని ఆమె ఆరోపించింది.

    అక్కడితో ఆగిందా...మహిళల ఆత్మహత్యల నివారణకు తనదైన శైలిలో సూచన చేసింది రాఖీ సావంత్. ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాలని సూచించింది. సీలింగ్ ఫ్యాన్లపై నిషేధం విధించాలని మీడియా ముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది.

    'కూతుళ్లు, సోదరీమణులు, కోడళ్లు సీలింగ్ ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నా. మీ కుమార్తెలు లేదా సోదరీమణులపై ప్రేమ ఉంటే ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లను పీకి బయటపడేయండి. టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి' అని రాఖీ సావంత్ సూచించింది. కాగా, ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    “Banning ceiling fans is more important than chanting ‘Bharat Mata ki Jai’ because many daughters and daughters-in-law are committing,” said Sawant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X