»   »  ‘ఎయిడ్స్ డే’: సమంత ఏం చేయబోతోందంటే...

‘ఎయిడ్స్ డే’: సమంత ఏం చేయబోతోందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ప్రత్యూష సపోర్ట్' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా హీరోయిన్ సమంత పలు సేవా కార్యక్రరమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా నిర్వహించారు. తాజాగా డిసెంబర్ 1న ‘అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు ప్లాన్ చేసారు.

Pratyusha Support World AIDS Day campaign

హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారులకు ప్రత్యేక పోషకాహారాన్ని అందించనున్నట్లు సమంత తెలిపింది. సుమారు వంద మంది చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందించునున్నట్లు తెలిపింది. హెచ్ఐవీ చిన్నారుల్లో చాలామందికి పోషకాహార సమస్య ఉందని.. ప్రత్యేక ఆహారం అందజేయడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని సమంత పేర్కొంది.

ఇందులో భాగంగా డిజైర్ సొసైటీలోని చిన్నారులకు 100 బాటిళ్ల హై ప్రొటీన్ ఫౌడర్ అందించనున్నారు. రేపటి నుండి ప్రతి నెల 1వ తారీఖున ఇవి అందించాలని నిర్ణయించారు.

Posted by Samantha Ruth Prabhu on Sunday, November 29, 2015
    English summary
    "In commemoration of this ‪#‎WorldAIDSDay‬, i.e the 1st of Dec, Pratyusha Support has resolved to donate 100 bottles of high protein powder (200 gm each) to the kids of Desire Society on the 1st of every month starting tomorrow." Samantha said.
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu