ప్రియమణి..ప్రవరాఖ్యుడులో కొత్తదనం ఏముందంటే...
జగపతి బాబు, ప్రియమణి లకాంబినేషన్లో ప్రవరాఖ్యుడు అనే చిత్రాన్ని మదన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం డీటీయస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ నాలగవ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను మీడియాతో ముచ్చటించారు. నిర్మాత గణేష్ ఇందుకూరి మాట్లాడుతూ...తన ప్రమేయం లేకుండా వరూధినిని ఆకర్షిస్తాడు 'ప్రవరాఖ్యుడు'. తర్వాత ఎంత కథ జరిగిందో చరిత్రనెరిగిన వారికి ఎరుకే... అదే లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఓ మహిళా కళాశాల ప్రొఫెసర్ కథతో రూపొందించిన చిత్రమే మా 'ప్రవరాఖ్యుడు'. ఇందులో కొత్త జగపతిబాబును చూస్తారు' అన్నారు. అలాగే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పెళ్ళయిన కొత్తలో చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టిన మదన్ మాట్లాడుతూ... "ఇది పదేళ్ళ వ్యవధిలో జరిగే కథ. విద్యార్థుల స్థాయి నుంచి అధ్యాపకుల స్థాయికి ఎదిగిన ఓ జంట కథ ఇది. కథ, కథనం ఈ సినిమాకి ప్రధానబలం. నేనెంతో ప్రేమించి చేసిన సినిమా ఇది. జగపతిబాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్ అంటు్న్నారు. అంతేగాక ప్రియమణికి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుంది. కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం డీటీయస్ మిక్సింగ్ జరుగుతోంది. డిసెంబర్ 4న చిత్రాన్ని విడుదల చేయనున్నాం' అని తెలిపారు. బెస్టాప్ లక్ ప్రవరాఖ్యుడు.


Click it and Unblock the Notifications











