»   » అల్లు అర్జున్‌కు ‘ప్రవాసి రత్న’ పురస్కారం

అల్లు అర్జున్‌కు ‘ప్రవాసి రత్న’ పురస్కారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.... తెలుగు సినీ పరిశ్రమతో పాటు మళయాల సినీ పరిశ్రమలో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఎర్పరచుకున్న సంగతి తెలిసిందే. బన్నీ సినిమాలకు కేరళలో మంచి మార్కెట్ ఉంది. ఆయన్ను కేరళ అభిమానులంతా బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు.

మళయాల సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ వేడుకలో అల్లు అర్జున్ 'ప్రవాసి రత్న' పురస్కారం అందుకోబోతున్నాడు. మన తెలుగులో మాటీవీ వారు 'మా' సినీ అవార్డ్స్ నిర్వహించినట్లే... మళయాల 24 గంటల ఎంటర్టెన్మెంట్ ఛానల్ 'ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్' వారు ఓ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో అల్లు అర్జున్‌ను 'ప్రవాసి రత్న' అవార్డుతో సత్కరించబోతున్నారు.

PRAVASI RATNA PURASKARAM For Allu Arjun

ఏసియా నెట్ ఛానల్ వ్యూవర్ షిప్ ప్రపంచ వ్యాప్తంగా 10మిలియన్ రీచ్ అయిన సందర్బంగా 'పొన్నోనమ్-2016' పేరుతో గల్ఫ్ దేశాల్లో నివస్తిస్తున్న ప్రవాస మళయాలీల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 19న సాయంత్రం 7 గంటలకు దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ వేడుక జరుగబోతోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అల్లు అర్జున్ సుముఖత వ్యక్తం చేసారని, మళయాల సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల ఎంటర్టెన్మెంట్ కార్యక్రమాలు, డాన్స్ షోలతో కలర్ ఫుల్ గా ఈ వేడుక జరుగబోతోందని నిర్వాహకులు తెలిపారు.

English summary
Stylish Star Allu Arjun, known as Mallu Arjun for Malayalam movie buffs, has immense fans frenzy in Mallu land will be honored with the title of ‘PRAVASI RATNA PURASKARAM’ by Star Asianet Middle East, the 24 hours Entertainment Television Channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu